Homeక్రైమ్ప్లాస్టిక్ గోదాం లో భారీ అగ్ని ప్రమాదం...!

ప్లాస్టిక్ గోదాం లో భారీ అగ్ని ప్రమాదం…!

మీర్ పేట్, క్రైమ్‌మిర్ర‌ర్‌: రంగా రెడ్డి జిలా్ల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి నందనవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో బార్ సమీపంలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చలరేగి వేగంగా క్షణాల్లోనే మంటలు భారీగా ఎగిసిపడటంతో గోడౌన్ పూర్తిగా దగ్ధమైంది.సమాచారం అందుకున్న వెంటనే మూడు అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. గోడౌన్‌లో భారీగా ప్లాస్టిక్ సామగ్రి నిల్వ ఉండటంతో మంటలు తీవ్రరూపం దాల్చి, పక్కనే ఉన్న మరో గోడౌన్‌తో పాటు సమీప భవనాలకు కూడా వ్యాపించాయి.

Also Read:2028 జూన్ 2 నాటికి వరంగల్ విమానాశ్రయం పూర్తి: రామ్మోహన్ నాయుడు

అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మీర్‌పేట పోలీసులు సైతం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు ధ్రువీకరించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ ప్రమాదం వల్ల భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Also Read:ఏపీ విద్యార్థులకు శుభవార్త: ఈ నెల 24లోగా తల్లుల ఖాతాల్లోకి ‘తల్లికి వందనం’ నిధులు!

 

తాజావార్తలు