Homeక్రైమ్ఏసీబీ వ‌ల‌లో మ‌రో అవినీతి తిమింగలం...!

ఏసీబీ వ‌ల‌లో మ‌రో అవినీతి తిమింగలం…!

పెద్ద‌ప‌ల్లి, క్రైమ్‌మిర్ర‌ర్‌: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్ గా పని చేస్తున్న సతీష్ లంచం తీసుకుంటుండ గా మంగళవారం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్ళితే ఓ కాంట్రాక్టర్ బిల్లు చెల్లించే విషయంలో సదరు అధికారి రూ. 2 లక్షలు డిమాండ్ చేయగా, బాధితు డు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన వారు సదరు కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తుండ గా ఏఈ కల్లేపల్లి సతీష్ కుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని రూ.2 లక్షలు నగదును స్వాధీనం చేసుకు న్నారు.

Also Read:‘పుష్పరాజ్’ పాన్-ఇండియా వ్యూహం.. టాలీవుడ్ దాటి.. అన్ని ఇండస్ట్రీలపై కన్నేసిన అల్లు అర్జున్!

అ నంతరం అతని నివాసంలో సోదాలు నిర్వహిం చారు. ఈ సోదాల్లో సుమారు రూ.32,31,900 విలువైన లెక్కల్లో చూపని నగదు లభ్యమైనట్లు వెల్లడించారు. ఈ నగదును స్వాధీనం చేసుకుని విచారణలో భాగంగా స్వాధీనం పరచిన ట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినా, తీసుకున్న వెంటనే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీబీ డిఎస్ పీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read:2028 జూన్ 2 నాటికి వరంగల్ విమానాశ్రయం పూర్తి: రామ్మోహన్ నాయుడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు