అంతరిక్షం నుంచి మన భూమిని చూసే అవకాశం చాలా అరుదైనది. ముఖ్యంగా రాత్రి సమయంలో చీకటిని చీల్చుకుంటూ మెరిసే నగరాల వెలుగులు, ఆకాశంలో కనిపించే ధృవ కాంతులు (Auroras), చంద్రుడి ఉదయ దృశ్యాలు కనువిందు చేస్తాయి. తాజాగా అలాంటి అద్భుతమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) వ్యోమగామి సోఫీ అడెనోట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భూమి రాత్రి అందాలను చిత్రీకరించారు. ఈ వీడియోలో అంతరిక్షం నుంచి కనిపించిన భూమి దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
also read: సింగరాయకొండలో విషాదం.. గూడ్స్ రైలు కింద పడి దంపతులు, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య
వీడియో ప్రారంభంలో చీకటిలో మెరిసే నగరాల విద్యుత్ వెలుగులు కనిపిస్తాయి. ఆ తర్వాత ఆకాశంలో ఆకుపచ్చ రంగులో మెరుస్తూ కదిలే ధృవ కాంతులు అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తాయి. చివరగా భూమి అంచు వెనుక నుంచి చంద్రుడు నెమ్మదిగా పైకి వస్తున్న దృశ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Jour 150, orbite 2326 — L’une de mes vues préférées depuis l’orbite : La Terre de nuit ✨🌍, illuminée par les activités humaines et les phénomènes naturels. Que notre planète est belle !
🎥 @ESA / @NASA#εpsilon • @esaspaceflight • @ESA_fr • @Space_Station • @NASAJohnson… pic.twitter.com/y9FTcM36Lb
— Adenot Sophie (@Soph_astro) July 13, 2026
ఈ అరుదైన అనుభూతిని పంచుకున్న సోఫీ.. అంతరిక్షం నుంచి రాత్రివేళ భూమిని చూడటం వర్ణించలేని అనుభూతి అని పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అంతరిక్షం నుంచి చూస్తే మన గ్రహం ఎంత అందమైనదో, అలాగే ఎంత సున్నితమైనదో ఈ దృశ్యాలు మరోసారి గుర్తుచేస్తున్నాయని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
also read: ‘RAW NTR’పై జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన.. అభిమానులకు స్పష్టమైన సందేశం