బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ముంబై బాంద్రాలోని ఆయన ఐకానిక్ నివాసం ‘మన్నత్’లో అదనపు నిర్మాణాలకు సంబంధించి దాఖలైన పిటిషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. షారుఖ్ ఖాన్ ఇంటి విస్తరణ పనులకు కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (CRZ) అధికారులు ఇచ్చిన అనుమతులను సవాల్ చేస్తూ ముంబైకి చెందిన సామాజిక కార్యకర్త సంతోష్ దౌండ్కర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. అనుమతుల విషయంలో జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు కనిపించడం లేదని అభిప్రాయపడింది.
also read: శృతి హాసన్ కొత్త ఇంటి గృహప్రవేశం.. కమల్ హాసన్ ఫ్యామిలీ కనిపించకపోవడంపై ఆసక్తి!
గతంలో ఇదే అంశంపై దౌండ్కర్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)ను ఆశ్రయించారు. అయితే నిర్మాణ అనుమతులపై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ ఎన్జీటీ ఆ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా.. ఇది ఓ ప్రముఖ నటుడికి సంబంధించిన కేసు అయినప్పటికీ, కోర్టు ఎలాంటి ప్రత్యేక దృష్టితో వ్యవహరించదని ధర్మాసనం స్పష్టం చేసింది. వ్యక్తి పేరు, కీర్తి ఆధారంగా కాకుండా చట్టపరమైన అంశాల ఆధారంగానే నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. చట్టపరమైన నిబంధనలు పాటిస్తూ ఒక వ్యక్తి తన సొంత ఆస్తిలో నిర్మాణాలు చేపడితే, అనవసరంగా ఇతరులు జోక్యం చేసుకోవడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీంతో షారుఖ్ ఖాన్ ‘మన్నత్’ నిర్మాణ అనుమతులపై ఉన్న వివాదానికి తెరపడినట్లైంది.
also read: ‘తుంబాడ్ 2’లో ఆలియా భట్ ఎంట్రీ.. సోహుమ్ షా ప్రకటనతో పెరిగిన అంచనాలు!