పెళ్లి విషయంపై కుటుంబ ఒత్తిడి ఎంతవరకు వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తుందో చూపించే ఒక సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేటర్‌గా గుర్తింపు పొందిన కీర్తనా మీనన్ తీసుకున్న నిర్ణయం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కుటుంబ సభ్యులు పెళ్లి కోసం ఒత్తిడి చేస్తున్నారనే నేపధ్యంలో, ఆమె తల వెంట్రుకలను పూర్తిగా తీసేయించుకుని వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. “మా అమ్మ నా పెళ్లి ప్లాన్ చేసింది” అనే క్యాప్షన్‌తో ఈ వీడియో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో విభిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్లు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ, మహిళల వ్యక్తిగత నిర్ణయాలను గౌరవించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. పెళ్లి వంటి ముఖ్యమైన విషయాల్లో అమ్మాయిల అభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.
అయితే మరికొందరు మాత్రం ఈ చర్యపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం కంటెంట్ కోసం చేసిన స్టంట్ కావచ్చని, అసలు పరిస్థితులు తెలియకుండానే నిర్ణయాలకు రావడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాలంలో యువత తమ వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సోషల్ మీడియాను వేదికగా ఉపయోగించడం పెరిగింది. కుటుంబ వ్యవస్థ, సంప్రదాయాలు, వ్యక్తిగత స్వేచ్ఛ మధ్య సమతౌల్యం ఎలా ఉండాలన్న చర్చలు కూడా ఇలాంటి ఘటనలతో మరింతగా ముందుకు వస్తున్నాయి.
also read: జగన్నాథనామ స్మరణం… రథం కదిలే క్షణం… అపూర్వ దృశ్యం