Homeఆంధ్ర ప్రదేశ్ఈకేవైసీతో గ్యాస్ అక్ర‌మాల‌కు చెక్‌...! ఈ కేవైసీ లేకుంటే గ్యాస్ సిలిండ్ క‌ట్‌...

ఈకేవైసీతో గ్యాస్ అక్ర‌మాల‌కు చెక్‌…! ఈ కేవైసీ లేకుంటే గ్యాస్ సిలిండ్ క‌ట్‌…

అమ‌రావ‌తి, క్రైమ్ మిర్ర‌ర్‌: ఆయిల్ కంపెనీలు ఈకేవైసీ లేని వారికి బిగ్ షాక్‌ను ఇచ్చాయి. జూన్ 30లోగా ఈకేవైసీ లేని వినియోగ‌దారుల‌కు గ్యాస్ సిలిండర్ బుకింగ్‌ను త‌త్కాలికంగా నిలిపివేశారు. దీంతో తిరుప‌తి జిల్లాలో అనేక జిల్లాలో వేలాది మందికి బుకింగ్ లేకుండా పోయింది. గ‌తంలో అనేక సార్లు గ్యాస్ సిలిండ్‌కు సంబంధించి ఈకేవైసీ చేసుకోవాల‌ని ఆయిల్ కంపెనీలు హెచ్చ‌రించిన అవ‌గాహ‌న లేక చాలా మంది చేయుఇంచుకోలేదు. ఈకేవైసీ చేయించుకున్న త‌రువాత పంపించ‌నున్నారు.

అక్రమ కనెక్షన్లకు చెక్‌…

Also Read:అర నిమిషంలో 195 కిస్సులు.. బ్రెజిల్ జంట గిన్నిస్ వరల్ఢ్ రికార్డ్!

గతంలో దీపం పథకం ద్వారా డిపాజిట్‌ చెల్లించకుండా ఉచితంగా కనెక్షన్‌, పొయ్యి, రెగ్యులేటర్‌ అన్నీ ఇచ్చారు. ఉజ్వల ద్వారా రాయితీలు పొందుతున్నారు. ఈ రెండింటి ద్వారా జిల్లాలో 2లక్షలమంది వరకు లబ్ధి పొందుతున్నట్లు అంచనా. గతంలో ఈకేవైసీ సమస్య లేనందున కొందరు చనిపోయినా వారి బంధువులు అనధికారికంగా కనెక్షన్లు కొనసాగిస్తున్నారు. వారి సొంత కనెక్షన్‌కు వచ్చే సిలిండర్లు బుక్‌ చేసుకుని నల్లబజారులో అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం కనెక్షన్‌ ఎవరి పేరు మీద ఉంటే వారే ఈకేవైసీ చేయాల్సి రావడంతో అనధికారిక కనెక్షన్లు శాశ్వతంగా నిలిచిపోనున్నాయి.

Also Read:ప‌శ్చిమ బెంగాల్‌లో దారుణం…! పసిమొగ్గపై లైంగిక దాడి…

దాదాపు 10శాతం మంది వినియోగదారులు ఈకేవైసీ చేయించుకోలేదు. ఇందులో చనిపోయిన వినియోగదారులు 5శాతం వరకు ఉంటారు. గ్యాస్‌ వినియోగిస్తూ ఈకేవైసీ చేయించుకోని వారు 3శాతం వరకు ఉంటారు. గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నా వేలిముద్రలు నమోదు కాని వృద్ధులు 2శాతం ఉంటారు. ఈకేవైసీ లేకుంటే బుకింగ్‌ నిలిచిపోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్లపై ఇస్తున్న రాయితీ కూడా జమకాదు.

ఇలా చేస్తే సరి…

Also Read:శంషాబాద్ కు మరో గుర్తింపు…! హ్యాపీయెస్ట్ ఎయిర్‌పోర్ట్స్‌లో 4వ స్థానం…

తాత్కాలికంగా బుకింగ్‌ నిలిపివేసిన గ్యాస్‌ కనెక్షన్‌ను మళ్లీ పునరుద్ధరించుకునేందుకు అవకాశం ఉంది. గ్యాస్‌ ఏజన్సీకి వెళ్లి ఆధార్‌ ఇస్తే వేలిముద్ర తీసుకుని ఏజెన్సీ నిర్వాహకులే ఉచితంగా చేస్తారు. లేదా గ్యాస్‌ డెలివరీ వారి దగ్గర కూడా ఈకేవైసీ యంత్రాలు ఉంటాయి. వారి ద్వారా కూడా ప్రక్రియ పూర్తి చేయవచ్చు. వెంటనే గ్యాస్‌ కనెక్షన్‌ పునరుద్ధరణ అవుతుంది.వృద్ధాప్యంలో వేలి ముద్రలు పడని వారు ఆధార్‌ సెంటర్‌కు వెళ్లి ఐరిస్‌ అప్‌డేట్‌ చేసుకుంటే దాని ద్వారా ఈకేవైసీ చేయించుకోవచ్చు. లేదా కదల్లేని వృద్ధుల పేరు మీద ఉన్న కనెక్షన్‌ కుటుంబ సభ్యుల పేరిట మార్చుకునే అవకాశం ఉంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు