హైదరాబాద్,క్రైమ్‌మిర్రర్: ”లెనిన్’ విజయం నాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ‘భారతి’ పాత్ర జీవితాంతం గుర్తుండిపోతుంది’ అని హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అన్నారు. అఖిల్ అక్కినేని హీరోగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన ‘లెనిన్’ చిత్రాన్ని అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించగా, మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో భాగ్యశ్రీ బోర్సే సినిమా విజయంతో పాటు తన పాత్రకు లభిస్తున్న స్పందన, సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
లెనిన్ విజయంతో ఎంతో సంతృప్తి ఇచ్చింది…
Also Read:Mana Jampala: 9 ఏళ్లకే కోడింగ్.. 12 ఏళ్లకే ఏఐ CEO.. అబ్బుర పరుస్తున్న భారత సంతతి చిన్నారి!
ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ సినిమా గురించి, నా నటన గురించి ఎంతో మంచి మెసేజ్‌లు పంపుతున్నారు. ఈ విజయం నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఈ సినిమా విషయంలో మీరు చాలా ఎమోషనల్ అయ్యారు. ప్రతి సినిమాను ఎంతో ఇష్టంతోనే చేస్తాం. ప్రతి సినిమా మాకు ప్రత్యేకమే. ‘లెనిన్’ విషయంలో ఒక మంచి కథ దొరికింది. మేమంతా ఈ సినిమాను బలంగా నమ్మాం. మా నమ్మకం నిజం కావడంతో ఈ విజయం మరింత భావోద్వేగంగా అనిపించింది. నా కెరీర్ ప్రారంభం నుంచి ప్రేక్షకులు నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు.
Also Read:Domestic Violence: ఇంట్లో గొడవ ఘోరం..కోపంతో మొబైల్ విసిరిన భార్య.. భర్త మృతి!
తెలుగు అమ్మాయిలానే చూస్తున్నారు. వారి అభిమానానికి నేను ఎప్పుడూ కృతజ్ఞురాలినే. నా చివరి సినిమా వరకు హైదరాబాద్‌లోనే ఉంటాను, ఈ పరిశ్రమలోనే కొనసాగుతాను అని చెప్పారు. తెలుగు సినిమా నాకు నటిగా అవకాశం ఇచ్చింది. నా తొలి సినిమా ప్రయాణం హైదరాబాద్ నుంచే ప్రారంభమైంది. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ప్రేమగా ఆదరించారు. తెలుగు అమ్మాయిలాగే నన్ను సుకుంటున్నారు. అందుకే హైదరాబాద్, తెలుగు సినిమా పరిశ్రమ నాకు ఎంతో ప్రత్యేకం. ఈ అనుబంధం జీవితాంతం కొనసాగాలని కోరుకుంటున్నాను. లెనిన్ మూవీ అందమైన కథ. దర్శకుడు కథ చెప్పినప్పుడే నా మనసును హత్తుకుంది. ఈ పాత్రలో నటనకు మంచి అవకాశం ఉందని అప్పుడే అనిపించింది. ఇప్పుడు ప్రేక్షకులు ‘భారతి’ పాత్రను ఇంతగా అభిమానించడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి పాత్ర రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
Also Read:Anupam Kher: అయోధ్య విరాళాల కేసు.. అనుపమ్ ఖేర్ సంచలన వ్యాఖ్యలు.. నెట్టింట దుమారం!