క్రైమ్ మిర్రర్,హైదరాబాద్:- తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచే దిశగా, విద్యార్థుల పురోగతిలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంచేలా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, మరియు మోడల్ స్కూళ్లలో తప్పనిసరిగా ‘పేరెంట్స్-టీచర్ మీటింగ్’ నిర్వహించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ఈసారి నిర్వహించనున్న సమావేశాలకు ఒక ప్రత్యేకత ఉంది. ‘పేరెంట్స్ ప్రామిస్’ అనే స్పెషల్ థీమ్‌తో ఈ మీటింగ్‌ను విద్యాశాఖ ప్లాన్ చేసింది. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కేవలం ఉపాధ్యాయులకే కాకుండా తల్లిదండ్రులకు కూడా సమాన బాధ్యత ఉందని గుర్తుచేయడమే ఈ వినూత్న కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.ఈ ‘పేరెంట్స్ ప్రామిస్’ కార్యక్రమంలో భాగంగా పిల్లల చదువు, పాఠశాలకు వారి రోజువారీ హాజరు, మరియు విద్యార్థుల క్రమశిక్షణ వంటి ముఖ్యమైన అంశాలకు సంబంధించి విద్యాశాఖ మొత్తం 6 వాగ్దానాలను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ సమావేశానికి హాజరయ్యే విద్యార్థుల తల్లిదండ్రులు, ఆ ఆరు వాగ్దానాలను చదివి, అందులో ఒక దానిని ఎంచుకుని తప్పనిసరిగా సంతకం చేయాల్సి ఉంటుంది. ఇది పిల్లల చదువు పట్ల తల్లిదండ్రుల్లో మరింత బాధ్యతను పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు.ఈ మీటింగ్‌లో ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులతో ముఖాముఖి మాట్లాడతారు. తరగతి గదిలో పిల్లల చదువు ఎలా సాగుతోంది, వారి ప్రవర్తన ఎలా ఉంది, ఏయే సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్నారు అనే విషయాలను వివరిస్తారు. ఇంట్లో పిల్లలు చదువుకునేలా ఎలాంటి వాతావరణం కల్పించాలి, వారిని ఎలా ప్రోత్సహించాలి అనే విషయాలపై ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.
రూ. 100 కోట్ల క్లబ్‌లో అదరగొడుతున్న హీరోయిన్లు.. బాక్సాఫీస్ వద్ద లేడీ ఓరియెంటెడ్ సినిమాల హవా!
ఆరుగురిని చంపిన రాజ్‌కుమార్ ఆత్మహత్య…!