Homeక్రైమ్ఆరుగురిని చంపిన రాజ్‌కుమార్ ఆత్మహత్య...!

ఆరుగురిని చంపిన రాజ్‌కుమార్ ఆత్మహత్య…!

హైదరాబాద్, క్రైమ్‌మిర్ర‌ర్‌: షాబాద్‌లో ఆరుగురిని హత్య చేసిన కేసు నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని కొత్తూరు వద్ద రైల్వే పట్టాలపై స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో షాబాద్‌ దైవాలగూడలో పోక్సో కేసు పెట్టారని ఆరుగురిని హత్య చేశాడు రాజ్‌కుమారు. ఇది దేశ్యాప్తంగా అందర్నీ షాక్‌కి గురి చేస్తుంది. ఈ హత్యలు చేసిన తర్వాత తండ్రికి ఫోన్ చేసిన రాజ్‌కుమార్ తాను ఆత్మహత్య చేసుకుంటాని చెప్పాడు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్యలు జరిగిన రోజు నుంచి అతడి కోసం గాలిస్తున్నారు.

Also Read:భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్రం కీలక గుర్తింపు.. ఇమిగ్రేషన్ చెక్‌పోస్ట్‌గా ప్రకటన!

అయితే మూడు రోజుల తర్వాత ఆరుగురిని హత్య చేసిన హంతకుడు రాజ్‌కుమార్ తన మేనమామ ఊరిలో చనిపోయి కనిపించాడు. కొత్తూరు మండలం పంజర్లలో వ్యక్తి డెడ్‌బాడి ఉందని సమాచారం ఇచ్చారు. పోలీసులు వెళ్లి చూస్తే అతను రాజ్‌కుమార్ అని గుర్తించారు. అతని డెడ్‌బాడీ పక్కనే పాయిజన్ బాటిల్ కూడా ఉండటంతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని తేల్చారు. షాబాద్‌లో తనపై కేసు పెట్టిన బాలిక కుటుంబాన్ని, తన కుటుంబాన్ని అతి కిరాతకంగా శనివారం చంపేశాడు రాజ్‌కుమార్. తనపై పోక్సో కేసు పెట్టిన బాలిక ఇంటికి శుక్రవారం 11 గంటలకు వెళ్లాడు. తలుపు తీసిన వెంటనే బాలిక తల్లిని చంపేశాడు. తర్వాత బాలిక నాన్నమ్మ ప్రాణం తీశాడు.

Also Read:నేటితో ముగియనున్న SIR గడువు.. పొడిగింపు కోరుతూ ఈసీకి సీఈవో లేఖ!

అనంతరం బాలికను బలవంతంగా తీసుకెళ్లిపోయాడు. అక్కడి నుంచి నేరుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న దైవాలగూడకు చేరుకున్నాడు. అక్కడే చెరువుగట్టు వద్ద బాలికపై అత్యాచారం చేసి చంపేశాడు. అనంతరం తన ఇంటికి వెళ్లాడు. పిల్లల్ని చూపించాలని భార్యకు చెప్పి తలుపు తీసిన వెంటనే ఆమె చంపేశాడు. పడుకొని ఉన్న తన పిల్లలు ఇద్దరి గొంతులు కోశాడు. తాగిన మైకంలో తనపై కేసు పెట్టిన వారిపై కక్షపూని రాత్రంతా మారణహోమానికి తెగబడ్డాడు.

Also Read:భారత్ vs ఇంగ్లాండ్ తొలి వన్డే.. నేటి నుంచే వన్డే సిరీస్ సమరం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు