క్రైమ్ మిర్రర్,సినిమా డెస్క్:- మహారాష్ట్రకు చెందిన లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చి, నేడు వెండితెరపై తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటి భాగ్యశ్రీ బోర్సే తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులను గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో ఆమె తన తండ్రి పడిన కష్టాలు, కుటుంబ ఆర్థిక పరిస్థితుల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. పుట్టగానే ఆర్థిక ఇబ్బందులుతాను పుట్టిన తర్వాత తన తండ్రి ఉద్యోగం కోల్పోవడంతో తమ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొందని భాగ్యశ్రీ తెలిపారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఆకస్మికంగా ఎదురైన ఈ సంక్షోభం వారి జీవితాలను ఎంతగానో కుదిపేసిందని వివరించారు.తండ్రి పడిన ఆవేదనతన తండ్రి ఉద్యోగం కోసం ఇతరులను బతిమాలుకున్న సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె చెప్పారు. “నాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.. దయచేసి ఏదైనా ఒక ఉద్యోగం ఇవ్వండి ప్లీజ్” అని తన తండ్రి వేరొకరిని వేడుకోవడం తాను స్వయంగా చూశానని భాగ్యశ్రీ ఆవేదనతో గుర్తు చేసుకున్నారు.అదే నన్ను ముందుకు నడిపించిందిఆ రోజు తండ్రి పడిన ఆవేదనను చూసినప్పుడే, భవిష్యత్తులో కష్టపడి పనిచేసి, బాగా డబ్బు సంపాదించి తన కుటుంబాన్ని అత్యున్నత స్థాయిలో ఉంచాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఆ పట్టుదలే నేడు ఆమెను ఈ స్థానంలో నిలబెట్టిందని, కుటుంబానికి అండగా నిలబడేలా చేసిందని భాగ్యశ్రీ తెలిపారు. కష్టాల నుంచి వచ్చిన ఈ నటి పట్టుదలపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తాగునీటి కోసం ఆగిన ఆర్టీసీ బస్సు.. కాల్వలోకి దూసుకెళ్లిన వైనం
ప్రేమ వివాహానికి అడ్డుగా నిలిచిందని అత్తని గొడ్డలితో చంపిన అల్లుడు.. కూతురు కళ్లముందే దారుణ హత్య