Homeసినిమాప్రెగ్నెన్సీ టైంలో సమంతకు అరుదైన బాక్సాఫీస్ ఘనత..!

ప్రెగ్నెన్సీ టైంలో సమంతకు అరుదైన బాక్సాఫీస్ ఘనత..!

క్రైమ్ మిర్రర్, సినిమా:- టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో తెరకెక్కిన మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించినట్లు చిత్రబృందం ప్రకటించింది. మహిళా ప్రాధాన్య కథాంశంతో రూపొందిన ఈ చిత్రం విడుదలైన 24 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. దీంతో మహిళా ప్రధాన కథతో తెరకెక్కిన తెలుగు చిత్రాల్లో ఈ ఘనత సాధించిన తొలి సినిమాగా నిలిచింది.సమంత కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిన ఈ చిత్రం కమర్షియల్‌గా భారీ విజయాన్ని అందుకుంది. సాధారణంగా హీరోల ఆధారిత చిత్రాలే వంద కోట్ల క్లబ్‌లో చోటు దక్కించుకుంటుండగా, ఒక మహిళా ప్రధాన కథతో తెరకెక్కిన సినిమా ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం విశేషంగా మారింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, సినిమా తన బడ్జెట్‌తో పోలిస్తే 300 శాతానికి పైగా రికవరీ సాధించినట్లు తెలుస్తోంది.

బాలయ్యకు అన్నయ్యగా సంజయ్ దత్..? వర్కౌట్ అయ్యేనా!

దేశీయ మార్కెట్‌తో పాటు ఓవర్సీస్‌లో కూడా మా ఇంటి బంగారం కు మంచి స్పందన లభించింది. విదేశీ మార్కెట్‌లో 2.5 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి, మహిళా ప్రధాన చిత్రాల్లో అత్యధిక ఓవర్సీస్ కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విజయంతో ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సోలో ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాల జాబితాలో కూడా ఈ మూవీకి ప్రత్యేక స్థానం దక్కింది. ఈ విజయంపై స్పందించిన సమంత, ఇది కేవలం రూ.100 కోట్ల సంఖ్య మాత్రమే కాదు. మహిళా ప్రధాన కథలను ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో ఈ సినిమా మరోసారి నిరూపించింది. ప్రేక్షకులు చూపించిన ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు.
చిత్ర నిర్మాత, క్రియేటర్ రాజ్ నిడిమోరు కూడా ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు ప్రేక్షకులు మంచి కథలను ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి రుజువైంది. మా సినిమాకు లభించిన ఆదరణ ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని పేర్కొన్నారు.రాజ్ కె. నిడిమోరు కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రానికి బీవీ నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, సమంత రూత్ ప్రభు, హిమాంక్ రెడ్డి దువ్వూరు సంయుక్తంగా నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రంలో గుల్షన్ దేవయ్య, దిగంత్, గౌతమి, శ్రీముఖి, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు.మహిళా ప్రధాన చిత్రాలకు కూడా భారీ కమర్షియల్ మార్కెట్ ఉందని మా ఇంటి బంగారం మరోసారి నిరూపించడంతో, భవిష్యత్తులో ఇలాంటి కథలకు మరింత ప్రాధాన్యం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఓటరు జాబితాలో పేరు లేకపోతే చనిపోయినట్లే: ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు