Homeజాతీయంఫార్చ్యూన్ ఇండియా 'మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026': సత్తా చాటిన తెలుగు మహిళలు!

ఫార్చ్యూన్ ఇండియా ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’: సత్తా చాటిన తెలుగు మహిళలు!

క్రైమ్ మిర్రర్, జాతీయం:- ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ‘ఫార్చ్యూన్ ఇండియా’ తాజాగా విడుదల చేసిన ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మహిళలు సత్తా చాటారు. వ్యాపార, పారిశ్రామిక, వైద్య, సినీ రంగాల్లో తమదైన ముద్ర వేసి దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో సగర్వంగా నిలిచారు.జాబితాలో నిలిచిన తెలుగు మహిళలు, వారి ర్యాంకులు.

3వ స్థానం (టాప్-3):- అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి కుమార్తెలు సునీత, సంగీత, ప్రీత, శోభన ఈ జాబితాలో ఏకంగా 3వ స్థానంలో నిలిచి సత్తా చాటారు. వైద్య రంగంలో వీరు అందిస్తున్న సేవలకు గాను ఈ అరుదైన గుర్తింపు లభించింది.

26వ స్థానం:- ప్రముఖ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లా 26వ స్థానంలో నిలిచారు.

45వ స్థానం:- సినీ రంగం నుంచి పాన్ ఇండియా స్టార్, ప్రముఖ నటి రష్మిక మందన్న 45వ స్థానాన్ని కైవసం చేసుకుని తన క్రేజ్‌ను చాటుకున్నారు.

88వ స్థానం:- బయోలాజికల్-ఈ సంస్థ ఎండీ మహిమా దాట్ల ఈ ప్రతిష్టాత్మక జాబితాలో 88వ స్థానంలో నిలిచారు.

92వ స్థానం:- హెరిటేజ్ ఫుడ్స్ నుంచి నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి 92వ స్థానంలో నిలిచారు. వ్యాపార రంగంలో తమ నాయకత్వ లక్షణాలతో వీరు ఈ గుర్తింపు పొందారు.వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తూ, తమ అద్భుతమైన నాయకత్వ ప్రతిభతో దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ మహిళలు భవిష్యత్ తరాలకు ఎంతగానో ఆదర్శంగా నిలుస్తున్నారు.

జగన్ నమ్ముకున్నది గొడ్డలిని, సోషల్ మీడియానే అంటూ సీఎం చంద్రబాబు ఆగ్రహం!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు