Homeతెలంగాణఈటెల వ్యాఖ్య‌లు పార్టీలో చ‌ర్చానీయాంశం...! బీజేపీలో ఇముడ‌లేక‌పోతున్న‌ది నిజ‌మేనా...?

ఈటెల వ్యాఖ్య‌లు పార్టీలో చ‌ర్చానీయాంశం…! బీజేపీలో ఇముడ‌లేక‌పోతున్న‌ది నిజ‌మేనా…?

కరీంనగర్,క్రైమ్‌మిర్ర‌ర్‌: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. తనకు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమని, ఆ తర్వాతే పార్టీ అని, ఆ తర్వాతే వ్యక్తిగతమని ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో లోతైన చర్చకు కారణమయింది. ఈటల రాజేందర్ మావోయిస్టుల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నుంచి బీఆర్ఎస్ లో పనిచేశారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నప్పటికీ ఆయన తనదైన ముద్రను వేసుకున్నారు. బీసీ నేతగా ఉన్న ఈటల రాజేందర్ తొలి నుంచి వివాదాలకు దూరంగా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ తో పొసగకపోవడంతో పాటు ఆయన వైఖరిని వ్యతిరేకించడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.. దీంతో ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ బీజేపీ లో చేరారు. హుజారాబాద్ లో ఓటమి పాలయినా 2024 ఎన్నికల్లో ఈటల రాజేందర్ మల్కాజ్ గిరి నుంచి బీజేపీ తరుపున పోటీ చేసి ఎన్నికయ్యారు.

Also Read:ఒక్క పోస్ట్ కి ఇన్నీ లక్షలా?.. వామ్మో శ్రీలీల!

అయితే సామాజికవర్గం కోటాలతోతనకు మంత్రి పదవి లభిస్తుందని ఆశించారు. కానీ రాకపోవడంతో పాటు తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన హుజూరాబాద్ కు మాత్రం ఆయనను దూరం చేయడంతో పాటు పార్టీలో సరైన ప్రాతినిధ్యం కల్పించకపోవడంతో కొంత ఈటల రాజేందర్ ఇబ్బందులు పడుతున్నారని గతంలోనూ ప్రచారం జరిగింది. అయితే తిరిగి బీఆర్ఎస్ లో చేరతారన్న ప్రచారాన్ని డు ఈటల రాజేందర్ కొట్టిపారేశారు. కానీ ఇటీవల ఒక వివాహ వేడుకలో మాజీ మంత్రి కేటీఆర్ ను కలవడం, ఆయన కుటుంబ సభ్యులతో కలసి మాట్లాడటంతో మరొకసారి ఈ ప్రచారం ఊపందుకుంది. కానీ ఈటల రాజేందర్ మాత్రం తాను బీజేపీలోనే కొనసాగుతానని చెబుతున్నారు. కానీ ఆయన ఉన్నట్లుండి తనకు తెలంగాణ ముఖ్యమని ఎందుకన్నారు? పార్టీ తర్వాతేనని అన్న మాటకు అర్థం ఏంటన్న దానిపై కూడా బీజేపీ రాష్ట్ర నేతలు ఆరా తీస్తున్నారు. ఈట‌ల బీజేపీలో ఇమ‌డ‌లేక‌పోతున్నారన్న చ‌ర్చ జోరుగా సాగుతోంది.

Also Read:టీఎం కార్డు ఉన్నవారికి శుభవార్త.. రూ.5 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా – ఎలా పొందాలి?

మొద‌ట త‌న‌కు మంత్రిగా అవ‌కాశం వ‌స్తుంద‌నుకున్నారు. ఆ త‌ర్వాత బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి ద‌క్కుతుంద‌న్న ప్ర‌చారం జ‌రిగినా, ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ పెడుతూ వ‌చ్చారు త‌న వైరి వ‌ర్గం నేత‌లు. ఆ త‌ర్వాత కొంత సైలెంట్ గా ఉన్నా, కాళేశ్వరం విష‌యంలో ఈట‌ల రాజేంద‌ర్ దూకుడుగా మాట్లాడుతున్న తీరు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయ్యింది.కాళేశ్వ‌రం ప్రాజెక్టులోని మేడిగ‌డ్డ వ‌ద్ద ఉన్న క‌న్నేప‌ల్లి పంప్ హౌజ్ నుండి వాట‌ర్ లిఫ్టింగ్ పై కొంత‌కాలంగా కాంగ్రెస్-బీఆర్ఎస్ మ‌ధ్య మాట‌ల యుద్ధం నడుస్తోంది. బీజేపీ దాదాపు సైలెంట్ గా ఉన్నా, ఈట‌ల మాత్రం వాయిస్ బీఆర్ఎస్ కు అనుకూలంగా పెంచుతూ వ‌స్తున్నారు. అవినీతి వ‌ల్ల మేడిగ‌డ్డ కుంగింది, వాట‌ర్ లిఫ్టింగ్ సాధ్యం కాద‌ని సీఎం రేవంత్, ప్ర‌భుత్వం వాదిస్తుంటే… వాట‌ర్ లిఫ్టింగ్ సాధ్య‌మేన‌ని బీఆర్ఎస్ వాదిస్తుంది. బీఆర్ఎస్ వాద‌న‌ను ఎంపీ ఈట‌ల స్ట్రాంగ్ గా స‌పోర్ట్ చేస్తూ వ‌స్తున్నారు.అవినీతి విష‌యంలో, అరెస్టుల విష‌యంలోకి నేను రాను. కానీ క‌న్నేప‌ల్లి వ‌ద్ద ప్ర‌భుత్వం రాజ‌కీయంగా చూస్తూ వాట‌ర్ లిఫ్ట్ చేయ‌టం లేద‌న్న‌ది ఈట‌ల వాద‌న‌. తాను ఎవ‌రో మాట్లాడిస్తే మాట్లాడే వాడిని కాద‌ని, తెలంగాణ మ‌ట్టిబిడ్డ‌ను, ఉద్య‌మకారుడిని కాబ‌ట్టి అడుగుతున్నా. రైతుల కోసం ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తూనే ఉంటానంటూ ఈట‌ల మ‌రోసారి స్పందించారు.

Also Read:రూ.7 కోట్లతో తీసి రూ.3800 కోట్ల వసూళ్లు… అబ్సెషన్ బాక్సాఫీస్ సంచలనం…!

ఇటీవ‌ల మాజీ ఎంపీ వినోద్ కొడుకు పెళ్లిలో కేటీఆర్ దంప‌తుల‌తో ఈట‌ల ఉన్న వీడియోలు వైర‌ల్ కావ‌టం, ఇప్పుడు ఉద్య‌మకారుడిని అంటూ చెప్తూనే కాళేశ్వ‌రం విష‌యంలో బీఆర్ఎస్ వాద‌న‌తో ఏకీభ‌వించ‌టం, బీజేపీలో ఉన్న గ్రూప్ రాజ‌కీయాల‌ను చూస్తుంటే… ఈట‌ల మ‌న‌సు మారుతోందా? అన్న అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయ‌ని, రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు- శాశ్వ‌త మిత్రులు ఉండ‌ర‌న్న విష‌యం మ‌ర్చిపోరాద‌ని విశ్లేష‌కులు గుర్తు చేస్తున్నారు.యాధృచ్ఛకంగా అన్న మాటలేనా? లేక ఇందులో ఏదైనా అంతరార్ధం ఉందా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఆయన బీఆర్ఎస్ లో చేరనని చెప్పడంతో బీజేపీలోనే కొనసాగుతూ తన అసంతృప్తిని వెళ్లగక్కే అవకాశముందని కూడా అంటున్నారు. తనను కేవలం ఒక ప్రాంతానికే పరిమితం చేయడంపైన కూడా ఈటల రాజేందర్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంత వరకైనా పోరాడాతానని ఈటల అనడం పైనా కూడా సోషల్ మీడియాలో వివిధ కామెంట్స్ వినపడుతున్నాయి. ఇప్పటికే బండి సంజయ్, కిషన్ రెడ్డిలతో ఈటల రాజేందర్ కు అంత సంబంధాలు మంచిగా లేవని, ఈటల రాజేందర్ ఎందుకు అన్నారన్నది కాలమే నిర్ణయిస్తుందని అంటున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు