Homeఆంధ్ర ప్రదేశ్వానాకాలంలో దంచి కొడుతున్న ఎండలు.. మరో 4 రోజులు ఇదే పరిస్థితి!

వానాకాలంలో దంచి కొడుతున్న ఎండలు.. మరో 4 రోజులు ఇదే పరిస్థితి!

•ఎల్ నినో ప్రభావంతో మండుతున్న భానుడు..తెలుగు రాష్ట్రాల్లో 40 డిగ్రీలు దాటనున్న ఉష్ణోగ్రతలు

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి అన్నట్లుగా ఉంది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితి. వానాకాలం కదా అని చల్లగా ఉంటుందని ఆశించిన ప్రజలకు, ఎండలు మండుతుండటంతో చుక్కలు కనిపిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావంతో వానాకాలం కాస్తా ఎండాకాలంగా మారిపోయింది.వర్షాలు పడటం పక్కన పెడితే, ఎండలు తీవ్రంగా దంచి కొడుతున్నాయి. గురువారం (నిన్న) తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 37 డిగ్రీల నుంచి 39 డిగ్రీల వరకు నమోదయ్యాయి. దీనికి తోడు ఉక్కపోత తీవ్రంగా ఉండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం పూట బయటకు వస్తే చాలు, విపరీతమైన ఎండ, చెమటలతో అల్లాడిపోతున్నారు. వేసవి కాలాన్ని తలపించేలా భానుడు భగభగమంటున్నాడు.మరో 4 రోజులు ‘మాన్సూన్ బ్రేక్’రాబోయే నాలుగు రోజుల పాటు కూడా వాతావరణం ఇలాగే ఉండనుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నాలుగు రోజులు ‘మాన్సూన్ బ్రేక్’ (నైరుతి రుతుపవనాల విరామం) ఉంటుందని, దీనివల్ల ఎండలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.రాబోయే రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీలు కూడా దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ సమయంలో వేసవిని తలపించేలా పరిస్థితులు ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా మధ్యాహ్నం వేళ అవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తగినన్ని నీళ్లు తాగుతూ, వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

ఎల్‌నినో ఎఫెక్ట్‌…! తెలంగాణ‌లో మినీ సమ్మర్…!

బెయిల్ పై విడుద‌లై ఆరుగురిని కిరాత‌కంగా చంపిన ఫొక్సో నిందితుడు…!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు