Homeఅంతర్జాతీయంబంగ్లా మాజీ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు...! బ‌తికినా, చ‌నిపోయినా సొంత‌గ‌డ్డ‌పైనే...!

బంగ్లా మాజీ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…! బ‌తికినా, చ‌నిపోయినా సొంత‌గ‌డ్డ‌పైనే…!

న్యూఢిల్లీ, క్రైమ్‌మిర్ర‌ర్: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాన మంత్రి, అవామీ లీగ్ పార్టీ నాయకురాలు షేక్‌ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను స్వదేశానికి వెళ్లి న్యాయస్థానం ఎదుట లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ.. మాతృదేశానికి వెళ్లే ఆలోచనలో ఉన్నానని ఆమె చెప్పారు. రాయిటర్స్ వార్త సంస్థకు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో హసీనా ఈ వ్యాఖ్యలు చేశారు. అరెస్టుకు లేదా చావడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని పేర్కొన్నారు. అయితే, ఈ విషయంపై ప్రస్తుత బంగ్లాదేవ్ ప్రభుత్వంతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని ఆమె ఉద్ఘాటించారు.‘‘స్వదేశానికి వెళ్లిన తర్వాత నన్ను వాళ్లు అరెస్టు చేయొచ్చు.. ప్రాణాలు తీసే అవకాశమూ ఉంది.. తీవ్ర అణచివేతకు గురువుతోన్న నా పార్టీ నేతలు, కార్యకర్తల కోసం నేను వెళ్లి తీరాలి.. ఒకవేళ మరణమే తథ్యమైతే నా తల్లిదండ్రులను సమాధి చేసిన చోట, నా సొంత గడ్డపైనే చనిపోవాలని కోరుకుంటున్నా’’ అని షేక్ హసీనా స్పష్టం చేశారు.

Also Read:గూగుల్ డ్రైవ్‌లో 15 మంది యువతుల ప్రైవేట్ వీడియోలు.. యువకుడి అరెస్ట్ – టెక్నాలజీతో నేరానికి చెక్!

ఏదేమైనప్పటికీ వచ్చే డిసెంబరులో తనతో పాటు అవామీ లీగ్ పార్టీ సీనియర్‌ నేతలు బంగ్లాదేశ్‌కు వెళ్లి కోర్టుల్లో లొంగిపోవాలని నిర్ణయానికి వచ్చామని చెప్పారు. అయితే, తన అప్పగింతపై భారత్‌కు బంగ్లా నుంచి అనేక లేఖలు రాస్తున్నారని.. ఈ నేపథ్యంలోనే వెళ్లాలని నిర్ణయం తీసుకున్నానని ఆమె పేర్కొన్నారు.రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌ యువత జులై 2024లో చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారి.. చివరకు షేక్ హసీనా పదవికి ఎసరు తెచ్చాయి. అదే ఏడాది ఆగస్టు 5న రాజీనామా చేసిన దేశం విడిచి భారత్‌కు పారిపోయిన వచ్చిన షేక్‌ హసీనా ఇక్కడే ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే, యువత నిరసనలను అణచివేయడంలో హసీనా పాత్ర ఉందని ఆరోపిస్తూ అనేక కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ ఆరోపణలను హసీనా తోసిపుచ్చారు. కానీ, బంగ్లాదేశ్‌ ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ మాత్రం విచారణ చేపట్టి ఆమెకు గతేడాది మరణశిక్ష విధించింది.

Also Read:తిరుమల అలిపిరి మార్గంలో చిరుత కలకలం.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

ఇటీవల మీడియాతో తాను స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధమేనని షేక్ హసీనా చెప్పినప్పటికీ.. ఎప్పుడు వెళ్తారనేది మాత్రం ఇప్పుడే అధికారికంగా స్పష్టత ఇచ్చారు. ఇదిలాఉంటే, మాజీ ప్రధానిని అప్పగించాలని మొహమూద్ యూనస్ నాయకత్వంలోని మధ్యంతర ప్రభుత్వంతో పాటు ఇటీవల ఎన్నికల అనంతరం ఏర్పడిన తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్పీ సర్కారు భారత్‌ను పలుసార్లు కోరాయి. ఈ అంశంపై న్యాయపరమైన విషయాలను పరిశీలిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే, తనపై పెట్టిన కేసులను రాజకీయ ప్రేరేపితమైనవిగా అభివర్ణించిన షేక్ హసీనా.. న్యాయపరమైన విచారణలో ఇది బయటపడుతుందని నమ్ముతున్నందుకే లొంగిపోవాలని భావిస్తున్నట్లు హసీనా చెప్పారు. ‘‘నేను న్యాయాన్ని నమ్ముతాను, విచారణ మొదలయ్యాక కోర్టు ఎంత హాస్యాస్పదంగా ఉందో ప్రజలకు స్పష్టమవుతుందని నేను భావిస్తున్నాను.. దాన్ని నేను నిరూపించాలనుకుంటున్నాను’’ అని ఆమె అన్నారు.

Also Read:ఒక్క పోస్ట్ కి ఇన్నీ లక్షలా?.. వామ్మో శ్రీలీల!

తనపై బనాయించిన కేసులు రాజకీయ ప్రేరేపితమైనవని హసీనా పేర్కొన్నారు. ఈ ఏడాది ఆరంభంలో ఆమెతో పాటు మరో 112 మందిపై పెట్టిన హత్యాయత్నం కేసును రద్దుచేయాలని బంగ్లాదేశ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సిఫార్సు చేసిన నేపథ్యంలో ఈ విషయంలో మరింత స్ఫష్టమైంది.అరెస్ట్‌లు, జైలుకు తాను ఆందోళన చెందడం లేదని ఆమె అన్నారు. తనకు జైలు జీవితం కొత్తకాదని, రాజకీయ జీవితంలో అనేకసార్లు జైలుకు వెళ్లొచ్చానని హసీనా తెలిపారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం నిషేధించిన అవామీ లీగ్‌ను పునర్వ్యవస్థీకరించే ప్రయత్నాలలో భాగంగా బంగ్లాదేశ్‌లోని 300 పార్లమెంటరీ నియోజకవర్గాలలో 125 నియోజకవర్గాలలో తాను ఆన్‌లైన్ సమావేశాలు నిర్వహిస్తున్నానని ఆమె చెప్పారు. అయితే, తన 20 ఏళ్ల పదవీ కాలాన్ని సమీక్షిస్తూ పొరపాట్లు జరిగి ఉండొచ్చని అంగీకరించిన హసీనా.. అంతిమ తీర్పు బంగ్లాదేశ్ ప్రజలదేనని ఆమె నొక్కి చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు