Homeతెలంగాణఎల్‌నినో ఎఫెక్ట్‌...! తెలంగాణ‌లో మినీ సమ్మర్...!

ఎల్‌నినో ఎఫెక్ట్‌…! తెలంగాణ‌లో మినీ సమ్మర్…!

హైదరాబాద్, క్రైమ్‌మిర్ర‌ర్‌: తెలంగాణలో జూలై 15 వరకు రుతుపవనాలు బలహీనపడి బ్రేక్ మాన్‌సూన్ పరిస్థితులు ఏర్పడనున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో భారీ వర్షాలు కరువై.. పగటి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ముఖ్యంగా జూలై 12-15 మధ్య తూర్పు తెలంగాణలో 37 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు హైదరాబాద్‌లో 35 డిగ్రీల సెల్సియస్ నుంచి 37 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం వల్ల తూర్పు, ఈశాన్య భారతం మినహా మిగిలిన ప్రాంతాల్లో వర్షపాత లోటు పెరుగుతోందన్నారు.తెలంగాణలో ఈసారి విచిత్ర వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఫిబ్రవరి మెుదటి వారం నుంచి ఎండలు దంచకొట్టగా.. జులై నెల సగానికి వచ్చినా సరిపడా వర్షాలు లేవు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో రుతుపవనాలు మరింత బలహీనపడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. జూలై 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని చెప్పారు. దానికి తోడు తీవ్రమైన రుతుపవనాల విరామం పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read:ఇన్‌స్టాగ్రామ్‌తో శ్రీలీల భారీ ఆదాయం… ఒక్క ప్రమోషనల్ పోస్ట్‌కే లక్షల్లో రెమ్యూనరేషన్…!

జూలై మాసంలో సాధారణంగా భారీ వర్షాలు కురవాల్సి ఉండగా.. ఈసారి వాతావరణం అందుకు భిన్నంగా మారి.. ఒక మినీ సమ్మర్‌ను తలపించేలా ఎండ తీవ్రత పెరగనుంది.ముఖ్యంగా జూలై 12 నుండి 15 మధ్య కాలంలో తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగనున్నాయి. తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి, ఉష్ణోగ్రతలు ఏకంగా 37 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే ఛాన్సుంది. అలాగే రాజధాని హైదరాబాద్ నగరంలో కూడా పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ నుంచి 37 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగవచ్చు. తీవ్రమైన ఉక్కపోత, ఎండల కారణంగా స్థానికంగా అక్కడక్కడ వేడి ప్రభావంతో కురిసే తేలికపాటి వర్షాలు మినహా ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవచ్చునని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.ప్రస్తుతం దేశ వాతావరణాన్ని ‘ఎల్-నినో’ తీవ్రంగా ప్రభావితం చేస్తోందన్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నప్పటికీ, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలు తీవ్ర వర్షపాత లోటును ఎదుర్కొంటున్నాయన్నారు.

Also Read:గూగుల్ డ్రైవ్‌లో 15 మంది యువతుల ప్రైవేట్ వీడియోలు.. యువకుడి అరెస్ట్ – టెక్నాలజీతో నేరానికి చెక్!

కొంకణ్, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో మంచి వర్షాలు కురిసినప్పటికీ, విదర్భ, మరఠ్వాడ వంటి ప్రాంతాలు ఇంకా తీవ్ర వర్షపాత లోటులోనే ఉన్నాయని చెప్పారు. జూలై ద్వితీయార్థంలో ఇక్కడ పరిస్థితులు మరింత క్షీణించవచ్చునని చెప్పారు. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కేవలం రుతుపవనాల ప్రారంభంలో మాత్రమే వర్షాలు పడ్డాయని.. ఆ తర్వాత అక్కడ కూడా పెద్దగా వర్షాలు లేవని చెప్పారు. మాన్సూన్ ట్రఫ్ ఉత్తర దిశగా విస్తరించడం, అలాగే ఎల్‌నినో అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల కేవలం ఒడిశా, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే మంచి వర్షాలు కురుస్తున్నాయన్నారు.ప్రస్తుతం భారతదేశం మొత్తం మీద సగటు వర్షపాతం సాధారణం కంటే మైనస్ 14 శాతం లోటుతో నడుస్తోందని చెప్పారు. రుతుపవనాలు బలహీనంగా ఉండటం వల్ల జూలై చివరి నాటికి ఈ లోటు 20 నుండి 25 శాతానికి పెరిగే ప్రమాదం ఉందన్నారు. జూలై రెండో భాగంలో కొన్ని అల్పపీడనాలు ఏర్పడినప్పటికీ.. తెలంగాణకు మాత్రం జూలై చివరి 10 రోజులు మాత్రమే వర్షాలు కురిసే ఛాన్సుందన్నారు. ఒకవేళ ఆ సమయంలో కూడా వర్షాలు కురవకపోతే.. ఇక ఆగస్టు నెలపైనే ఆశలు పెట్టుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు