Crime Mirror, Updates: చైనాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం సాయంత్రం చైనాలోని ఒక షూ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభించడంతో అందులో పని చేస్తున్న పలువురు కార్మికులు మృతి చెందారు. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులను కాపాడలేని పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది.
ఇప్పటి వరకు వచ్చిన సమాచారం మేరకు చైనాలోని పుజియాన్ ప్రావిన్సులోని జిన్జియాంగ్ నగరంలో ఒక ప్రముఖ షూ తయారీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో వందలాది మంది కార్మికులు పని చేస్తున్నట్టు చైనా అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ప్రమాదం జరిగిన వెంటనే మంగలు పెద్ద ఎత్తున ఎగిసిపడడంతోపాటు పరిశ్రమ మొత్తం వ్యాప్తి చెందాయి. దీంతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మంటల్లోనే పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులంతా చిక్కుకోవడంతో భారీ సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
దీనిపై చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ స్వయంగా స్పందించారు. ప్రాణ నష్టంగా భారీగా ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొనడం గమనార్హం. ఈ ప్రమాదంపై స్వయంగా అధ్యక్షుడే స్పందించడంతో ప్రమాద తీవ్రత భారీగా ఉంటుందని అంతర్జాతీయంగా కథనాలు వెలువడుతున్నాయి.
-
మండే స్వభావం కలిగిన వస్తువులు ఉండడంతో..
షూ తయారు చేసే పరిశ్రమలో గురువారం సాయంత్రం సమయంలో చిన్నగా మంటలు ప్రారంభమయ్యాయి. తొలుత చిన్నగా ప్రారంభమైన మంటలు క్షణాలు వ్యవధిలోనే ఉవ్వెత్తున ఎగిసిపడడంతోపాటు ఇతర చోట్లకు వ్యాప్తి చెందాయి. పాద రక్షలు తయారీకి వినియోగించే సామాగ్రి భారీగా ఉండడం, వాటికి మండే స్వభావం ఉండడంతో క్షణాల్లోనే మంటలు దావాణంలా వ్యాప్తి చెందాయి.
మంటలు భారీగా పెరగడంతోపాటు దట్టమైన పొగ పరిశ్రమ మొత్తాన్ని కమ్మేశాయి. దీంతో కార్మికులు భవనంపైకి చేరి ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కమ్మేసిన పొగ, మంటలు వల్ల పైకి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మంటలు చాలా వరకు అదుపులోకి రాకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
ఒకానొక దశలో మంటలు భారీగా ఎగిసిపడడంతో అగ్ని మాపక శాక సిబ్బంది లోపలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రమాదంలో ఎంత మంది మృతి చెందారు. ఎంత మంది తీవ్రంగా గాయపడ్డారన్న విషయాలు తెలియడం లేదు. అదే సమయంలో ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో ఎంత మంది విధుల్లో ఉన్నారన్న దానిని బట్టి మృతుల సంఖ్యపై స్పష్టత వస్తుందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.