Homeక్రైమ్కేతన్ హత్య కేసులో సంచలనం – నిశ్చితార్థం సమయంలోనే రహస్య వివాహం?

కేతన్ హత్య కేసులో సంచలనం – నిశ్చితార్థం సమయంలోనే రహస్య వివాహం?

కేతన్ హత్య కేసు దర్యాప్తులో తాజాగా వెలుగులోకి వచ్చిన విషయాలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన అనుమానితురాలిగా భావిస్తున్న సియా గోయల్ గురించి పోలీసులు గుర్తించిన కొత్త వివరాలు విచారణను మరింత క్లిష్టంగా మార్చాయి. పోలీసుల ప్రాథమిక విచారణలో బయటపడిన సమాచారం ప్రకారం, కేతన్ హత్యకు దాదాపు నాలుగు నెలల ముందే సియా గోయల్ తన ప్రేమికుడు చేతన్‌తో రహస్యంగా వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహం అధికారికంగా నమోదు కాలేదన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

అత్యంత ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, ఫిబ్రవరి 19న కేతన్ అగర్వాల్‌తో సియా నిశ్చితార్థం జరిగిన సమయంలోనే ఈ రహస్య వివాహం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ అంశంపై స్పష్టత కోసం దర్యాప్తు అధికారులు మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. విచారణలో కీలక ఆధారంగా మారింది సియా, చేతన్ మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్. ఈ చాటింగ్‌లో వారి సంబంధం, వివాహం గురించి పలు సూచనలు లభించినట్లు సమాచారం. అంతేకాకుండా, “ఎప్పటికి జరగని పెళ్లి” అంటూ సియా తన స్నేహితురాలితో చేసిన సంభాషణ కూడా కేసులో ముఖ్యమైన క్లూగా మారింది.

ఈ మొత్తం పరిణామాలు కేసు వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను వెలికి తీసే దిశగా పోలీసులను నడిపిస్తున్నాయి. ప్రేమ, మోసం, ద్వంద్వ జీవితం వంటి అంశాలు కలిసిన ఈ కేసు ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతుండగా, ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.

also read: వయనాడ్ ఘటన: ఐదుగురికి చేరిన మృతుల సంఖ్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు