హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: మార్కాపురం జిల్లాలో పెళ్లి ఊరేగింపులో జరిగిన చిన్న ఘటన పెద్ద మలుపు తీసుకుంది. వధువు డ్యాన్స్ చేయకుండా వరుడు అడ్డుకోవడంతో వధువు తండ్రి ఆగ్రహించి పెళ్లిని రద్దు చేశాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మార్కాపురం జిల్లాలో జరిగిన ఒక చిన్న ఘటన పెద్ద చర్చకు దారితీసింది. పెళ్లికి ముందు జరిగిన చిన్న గొడవ చివరకు పెళ్లే రద్దు కావడానికి కారణమైంది. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది.సమాచారం ప్రకారం, పెళ్లి వేడుకలో భాగంగా వధూవరులను ప్రత్యేక వాహనంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. బంధువులు, స్నేహితులు డ్యాన్స్‌లు చేస్తూ ఎంతో ఉత్సాహంగా వేడుకను ఆస్వాదించారు.
Also Read:నిజామాబాద్‌లో దారుణం….! ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య…!
ఆ సమయంలో అక్కడ ఉన్నవారు వధూవరులను కూడా డ్యాన్స్ చేయాలని కోరారు. వధువు అందుకు వెంటనే అంగీకరించింది. అయితే వరుడు మాత్రం డ్యాన్స్ చేయనని చెప్పాడు. అంతే కాకుండా, “నేను డ్యాన్స్ చేయను… నువ్వూ చేయొద్దు” అంటూ వధువును అందరి ముందే ఆపినట్లు తెలుస్తోంది. వరుడి ఈ ప్రవర్తన వధువు కుటుంబానికి నచ్చలేదు. ముఖ్యంగా వధువు తండ్రి తీవ్ర అసంతృప్తికి రయ్యాడు. “పెళ్లికి ముందే ఇలా ప్రవర్తిస్తే, పెళ్లి తర్వాత మా అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది?” అని ఆందోళన వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా, తన కుమార్తెను వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు. దీంతో కొద్దిసేపట్లో జరగాల్సిన పెళ్లి కార్యక్రమం పూర్తిగా నిలిచిపోయింది.
Also Read:ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఖాతాల్లోకి వడ్డీ జమ
ఇరు కుటుంబాలు కలిసి మాట్లాడుకున్నప్పటికీ పెళ్లి కొనసాగించే నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఆ తర్వాత పెళ్లికి సంబంధించిన కట్నకానుకలు, ఇతర లావాదేవీలను కూడా ఇరు కుటుంబాలు పరస్పర అంగీకారంతో పరిష్కరించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వరుడి ప్రవర్తన సరైంది కాదని అంటుండగా, మరికొందరు చిన్న విషయాన్ని పెద్ద సమస్యగా మార్చారని అభిప్రాయపడుతు న్నారు. అయితే పెళ్లి వంటి జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయంలో పరస్పర గౌరవం, ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించడం చాలా అవసరమని పలువురు గుర్తుచేస్తున్నారు.