Homeతెలంగాణభువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి కన్నుమూత

భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి కన్నుమూత

క్రైమ్ మిర్రర్,హైదరాబాద్:- ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన భువనగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు కొమ్మిడి నర్సింహారెడ్డి (83) ఇకలేరు. గత కొంతకాలంగా వయోభారం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విన్న ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయ వర్గాల్లో మరియు ప్రజల్లో తీవ్ర విషాదం నెలకుంది.

రెండుసార్లు ఎమ్మెల్యేగా సేవలు:-
కొమ్మిడి నర్సింహారెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. భువనగిరి నియోజకవర్గం నుండి ఆయన రెండుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.1978 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి విజయం సాధించారు.1983 ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫునే పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి, నియోజకవర్గ ప్రజలకు సేవలందించారు.

పేదల పట్ల అపరిమితమైన ప్రేమే ఈ ‘భూరి దానం’:-రాజకీయ నాయకుడంటే కేవలం అధికారం మాత్రమే కాదని, త్యాగనిరతి కూడా ఉండాలని నిరూపించిన మహోన్నత వ్యక్తి నర్సింహారెడ్డి. సమాజంలో నిరుపేదలకు ఆసరాగా నిలవాలనే ఉద్దేశంతో ఆయన ఏకంగా 300 ఎకరాల సొంత భూమిని పేదలకు ఉచితంగా దానం చేశారు. ఈ దాతృత్వం ఆయన నిస్వార్థ సేవా నిరతికి, నిరుపేదల పట్ల ఆయనకున్న ఉన్నతమైన గుణానికి నిదర్శనంగా నిలిచింది.ఉమ్మడి నల్గొండ జిల్లాను దశాబ్దాల పాటు పట్టిపీడించిన ఫ్లోరైడ్ మహమ్మారిపై కొమ్మిడి నర్సింహారెడ్డి నిరంతరం గళమెత్తారు. బాధితులకు సురక్షితమైన తాగునీరు అందించేలా, అలాగే బాధితులకు తగిన వైద్య మరియు ప్రభుత్వ సహాయం అందేలా అనేక ఉద్యమాలు మరియు పోరాటాలు చేసి వారి పక్షాన నిలిచారు.కొమ్మిడి నర్సింహారెడ్డి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. నిస్వార్థంగా ప్రజా సేవ చేసిన గొప్ప నేతను భువనగిరి కోల్పోయిందని వారు కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

టీవీ న్యూస్ ఛాన‌ళ్ల‌కు కేంద్రం భారీ షాక్‌…! టీఆర్‌పీల‌పై నిషేదం…

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు