Homeజాతీయంఅయోధ్య రామాలయానికి కొత్త సీఈవో.. విరాళాలు పక్కదారి పట్టడంతో కీలక నిర్ణయం

అయోధ్య రామాలయానికి కొత్త సీఈవో.. విరాళాలు పక్కదారి పట్టడంతో కీలక నిర్ణయం

క్రైమ్ మిర్రర్, జాతీయం:- అయోధ్య రామ మందిర విరాళాలకు సంబంధించి అవకతవకలు చోటు చేసుకోవడంతో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రామ మందిర ఉద్యమాన్ని ముందుండి నడిపించిన బిజెపి, సాంగ్ పరివార్లు అయోధ్య రామ మందిరంలో కోట్ల రూపాయల చందా చోరీ వదంతంతో మసక బారిన ఆలయ ప్రతిష్ట పునరుద్ధరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే ఆలయ నిర్వహణ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించేలా కొత్తగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) పదవిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక భేటీలో తాజాగా నిర్ణయం తీసుకున్నారు. సీఈఓ పదవికి అర్హతలు ఉన్న వ్యక్తి ఎంపిక బాధ్యతలను ముగ్గురు సభ్యులకు అప్పగించారు. దీంతో రామ మందిరానికి విరాళాలతో పాటు ఇతర పాలనాపరమైన నిర్వహణ బాధ్యతలను చూసేందుకు ప్రత్యేక అధికారిని నియమించే ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ కమిటీలో సభ్యులుగా విశ్రాంతి న్యాయమూర్తి ప్రమోద్ కోహ్లీ, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, ట్రష్టి సురేష్ హవారేలను తీసుకున్నారు. లక్షలాదిమంది భక్తులు సమర్పించిన నగదు, స్వర్ణాభరణ కొనుక్కులను కాజేసిన వసంతంలో నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తూ చంపత్రాయ్ తీసుకొన్న నిర్ణయాన్ని ట్రస్ట్ సమావేశంలో సభ్యులు ఆమోదించారు. ట్రస్ట్ సభ్యుడుగా ఉన్న అనిల్ మిశ్రా రాజీనామాను ఆమోదించారు. ప్రస్తుతం ట్రస్ట్ గా ఉన్న కృష్ణమోహన్ ను తాత్కాలిక ప్రధాని కార్యదర్శిగా నియమిస్తూ సమావేశంలో సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.

రామాలయానికి ఇప్పటి వరకు అందిన నిధులు లెక్క ఇది..

అయోధ్య రామాలయానికి ఇప్పటివరకు భక్తులు అందించిన నిధులు లెక్కలకు సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయి. విరాళాల చోరీ నేపథ్యంలో రాములవారికి అందించిన లెక్క గురించి సర్వత్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ట్రస్టు ఆలయానికి అందిన విరాళాలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. అయోధ్య రామాలయానికి రూ.3,264 కోట్లు విరాళాలుగా అందాయని, అందులో రూ.2,370 కోట్లు ఆలయ నిర్మాణానికి, ఇతర పెట్టుబడులకు వ్యయమైనట్లు వెల్లడించింది. భక్తుల నుంచి హుండీల ద్వారా రూ.391 కోట్లు రాగా, వాటిని ఆలయ నిర్వహణకు వినియోగిస్తున్నట్లు పేర్కొంది. కానుకల రూపంలో అందిన వెండి నగలను కరిగించి కడ్డీల రూపంలో భద్రపరిచినట్లు ట్రస్టు విడుదల చేసిన వివరాల్లో పేర్కొన్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు