Homeఆంధ్ర ప్రదేశ్విశాఖలో గల్లంతయిన ఏడుగురు మత్స్యకారులు.. ఒకరి ఆచూకీ లభ్యం

విశాఖలో గల్లంతయిన ఏడుగురు మత్స్యకారులు.. ఒకరి ఆచూకీ లభ్యం

క్రైమ్ మిర్రర్, విశాఖపట్నం:- విశాఖ ఫిషింగ్ ఆర్బర్ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి ఆచూకీ లభించగా మిగిలిన ఆరుగురు కోసం ముమ్మరంగా గాలింపు చర్యలను చేపబడుతున్నారు. ఇప్పటికే నేవీకు చెందిన బృందాలు, కోస్ట్ గార్డు బృందాలు నాలుగు నౌకలతో, రెండు హెలికాఫ్టర్లతో గాలింపు చర్యలను ముమ్మరంగా చేపడుతున్నాయి. ఇకపోతే ఆచూకీ లభించిన కారి చిన్న అనే మత్స్యకారుడుని అటువైపుగా వస్తున్న వాణిజ్య నౌక కాపాడింది. మిగిలిన ఆరుగురు ఆచూకీ కోసం ప్రస్తుతం గాలింపు చర్యలను చేపడుతోంది. గల్లంతైన మత్స్యకారుల్లో విజయనగరం జిల్లా భోగాపురం మండలం మొక్కం గ్రామానికి చెందిన కారి చిన్న, కారి గరగయ్య, అమర అప్పలరాజు, కారి శీతోడు, విశాఖ జిల్లా భీమిలి మండలం పెద్ద నాగయ్య పాలానికి చెందిన రగతి బండియ్య, విశాఖ నగరానికి చెందిన చిన్న అమ్మోరు ఉన్నారు వీరంతా ఈ నెల ఒకటో తేదీన విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి బయలుదేరి సముద్రంలో చేపలు వేటకు వెళ్లారు. వేటకు వెళ్ళిన రెండు రోజులు తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో వారంతా సముద్రంలో చిక్కుకుపోయారు. శనివారం నాటికి ఇంటికి వస్తామని ఫోన్ చేసి చెప్పిన వారంతా రాకపోవడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం సహాయక బృందాలను రంగంలోకి దించి సముద్రంలో గాలింపు చర్యలను చేపట్టింది. బోటు ఆచూకీ లభించలేదు. అయితే వాణిజ్య నౌకకు చిక్కిన కారి చిన్న దొరికిన ప్రాంతంలోనే ప్రస్తుతం అధికారి యంత్రాంగం రెస్ట్యూ ఆపరేషన్ కొనసాగిస్తోంది.

గంటలపాటు పడవ పైనే ఉన్నామన్న చిన్న..

అటుగా వస్తున్న వాణిజ్య నౌకకు దొరికిన చిన్న తాము ఎదుర్కొన్న ఇబ్బందులను వెల్లడించారు. ఈ మేరకు ఒక వీడియోలో చిన్న జరిగిన ఉదాంతాన్ని వివరించారు. తాము వేట ముగించుకొని ఇంటికి వచ్చేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున అలలు రావడంతో తమ పడవ బోల్తా పడిందని చిన్న వెల్లడించారు. పడవపైకి ఎక్కి 9 గంటలపాటు నరకయాతన అనుభవించామన్న చిన్న.. దూరంగా కనిపిస్తున్న నౌకు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించామని, తాను ఒక్కడిని మాత్రమే చేరుకోగలిగానని వెల్లడించారు. వారంతా తన్న కుటుంబ సభ్యులందని, ఏమయ్యారో తెలియడం లేదంటూ విలపించాడు. ఇలా ఉంటే మత్స్యకారులు గల్లంతయ్యారు అన్న విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులు విశాఖలోని ఫిషింగ్ హార్బర్ వద్దకు చేరుకొని విలపించారు. వారిని మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, లోకం మాధవి, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు పరామర్శించి వారికి భరోసాను కల్పించారు. ప్రస్తుతం నాలుగు నౌకలు, రెండు హెలికాప్టర్ల సహాయంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. సోమవారం ఉదయం కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమైంది. మత్స్యకారుల ఆచూకీ లభించేంతవరకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని మంత్రులు వెల్లడించారు. ఈ ప్రమాద ఘటన తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా యంత్రాంగం తో మాట్లాడి సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు