క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- జనసేన పార్టీలో నాయకత్వ బాధ్యతలను స్వీకరించేందుకు ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ అందించే బాధ్యతలను తాము చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ వేలాదిమంది దరఖాస్తు చేసుకుంటున్నారు. జనసేన పార్టీ నిర్మాణ సారధుల సమాసార సేకరణ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది రోజుల కిందట ప్రారంభమైంది. జనసేన పార్టీ నిర్మాణ సారధుల కమిటీలు ఏడు రోజులుగా పార్టీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించేందుకు ఆసక్తిగా ఉన్న నాయకులు, సాధకులు, జన సైనికుల నుంచి దరఖాస్తులను స్వీకరించాయి. రాష్ట్రంలోని 25 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో గత నెల 25న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఏడు రోజులపాటు కొనసాగి ఆదివారం ముగిసింది. జనసేన పార్టీ నిర్మాణ సారుదుల కమిటీలకు ఆయా నియోజకవర్గాల పరిధిలో నుంచి వేలాదిగా దరఖాస్తులు వచ్చాయి. పార్టీ అందించే బాధ్యతలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 35,000 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు ఆ పార్టీ నాయకులు వెల్లడించారు. రాజకీయాల్లో నూతన వరవడి సృష్టించి, పార్టీ నిర్మాణ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ తాజాగా వెల్లడించారు. ఈ క్రమంలోనే జనసేన నిర్మాణ సారధుల సమాసార సేకరణ ప్రక్రియ ప్రారంభించినట్లు వెల్లడించారు. జనసేన పార్టీలోని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి పదవులకు సంబంధించి సమాచార సేకరణ అనే గొప్ప ప్రక్రియగా దీన్ని ఆయన అభివర్ణించారు. జెన్జీ ఆలోచనలకు దగ్గరగా, పారదర్శకంగా పార్టీని బలోపేతం చేసే క్రతువులు ఆదివారం నాటి భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. యువత నుంచి భారీగా దరఖాస్తు రావడంతో పార్టీ సంస్థగతంగా బలోపేతం అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ దరఖాస్తులను బట్టి జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో ఎంత బలంగా ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తుందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.
పార్టీ నాయకులతో పవన్ చర్చించి నిర్ణయం..
రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో ఆ పార్టీ నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయా దరఖాస్తులను క్రుణ్ణంగా పరిశీలించి పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి కీలకమైన బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఇదే విషయాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేశారు. ఆయా దరఖాస్తులను అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించి వారు పార్టీకి చేసిన కృషిని పరిశీలించి పదవులను అప్పగించనున్నారు. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో వాటిని పరిశీలించే తదుపరి దశ ప్రారంభం కానుంది. జిల్లాలు, నియోజకవర్గాలు వారీగా దరఖాస్తులను విడదీసి వాటిలో పార్టీకి బలంగా పనిచేస్తున్న కార్యకర్తలను గుర్తించి వారికి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను అప్పగించనున్నారు. ముఖ్యంగా పవన్ అంటే అభిమానం ఉన్న, పార్టీ పట్ల అంకితభావం కలిగిన వారికి ఈ కీలక బాధ్యతలను పార్టీ అధినాయకత్వం అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. భవిష్యత్తు రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ తీసుకునే నిర్ణయాలను సంస్థగతంగా అమలు చేయడంతో పాటు పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ఆలోచన ఉన్నవారికి అవకాశాలు కల్పించాలని పార్టీ భావిస్తోంది. అటువంటి వారినే ఎంపిక చేసేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నట్లు పార్టీ అగ్ర నాయకులు పేర్కొంటున్నారు. కొద్దిరోజుల్లోనే ఈ ప్రక్రియను ప్రారంభించి ఆగస్టు నాటికి పార్టీ సంస్థ గత నిర్మాణ ప్రక్రియను పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
Haryana Crime: ప్రేమ కోసం భర్తను లేపేసిన నవవధువు.. చివరకు వాట్సాప్ చాట్స్ తో దొరికిపోయింది!