Homeఆంధ్ర ప్రదేశ్స్కూల్ బ‌స్సులో మంట‌లు...! విద్యార్థులు సుర‌క్షితం...

స్కూల్ బ‌స్సులో మంట‌లు…! విద్యార్థులు సుర‌క్షితం…

పల్నాడు, క్రైమ్‌మిర్ర‌ర్‌: రొంపిచర్ల మండలం సంతగుడిపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం స్కూల్ బస్సులో ప్రమాదం తప్పింది. నరసరావుపేటకు చెందిన కే-రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సు కర్లకుంట గ్రామానికి విద్యార్థులను తీసుకురావడానికి వెళ్లి తిరిగి వస్తుండగా, బస్సులోని ఇంజిన్ భాగం నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగతో పాటు మంటలు చెలరేగాయి.

Also Read:అటల్ టన్నెల్ సమీపంలో భయానక రోడ్డు ప్రమాదం – కారులోకి దూసుకెళ్లిన వంతెన ఇనుప కడ్డీలు- ఒకరు మృతి

అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును ఆపి, అందులో ఉన్న విద్యార్థులను సురక్షితంగా కిందికి దించాడు. అనంతరం స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read:సినిమా కోసం ఎంతో శ్రమించా: హీరో విరాట్ కర్ణ- ‘నాగబంధం’పై భారీ నమ్మకం.. డూప్ లేకుండా యాక్షన్ సీన్లు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు