క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో(శంషాబాద్ ఎయిర్‌పోర్టు) 20 మంది మహిళా ప్రయాణికులను ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. మస్కట్‌కు వెళ్లేందుకు వచ్చిన వీరి వద్ద నకిలీ వీసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈరోజు(గురువారం) 20 మంది మహిళలు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. వీరంతా ఒమాన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మస్కట్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ 20 మంది మహిళలను ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు చెకింగ్ చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. మహిళల దగ్గర నకిలీ వీసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే 20 మందిని ఇమ్మిగ్రేషన్ ఆధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఎయిర్‌పోర్ట్ ఔట్‌పోస్ట్ పోలీసులకు అప్పగించారు. దీంతో 20 మంది మహిళా ప్రయాణికులను ఔట్‌పోస్ట్ పోలీసులు విచారిస్తున్నారు. నకిలీ వీసాలు ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఎవరు ఇచ్చారు అనేదానిపై ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
నకిలీ వీసాలతో మస్కట్‌కు వెళ్లేందుకు యత్నం.. 20 మంది మహిళల అరెస్ట్!!
By Crime Mirror
0
19
Next article