Homeక్రీడలుఇంగ్లండ్‌తో తొలి టీ20కి వర్షం ముప్పు: వైభవ్ సూర్యవంశీకి మళ్లీ నిరాశేనా?

ఇంగ్లండ్‌తో తొలి టీ20కి వర్షం ముప్పు: వైభవ్ సూర్యవంశీకి మళ్లీ నిరాశేనా?

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నేడు జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. ఇరు జట్ల మధ్య డర్హామ్‌లోని రివర్ సైడ్ మైదానంలో భారత కాలమానం ప్రకారం రాత్రి 10:00 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. వర్షం కారణంగా ఆట నిలిచిపోయే అవకాశం ఉందని వాతావరణ సంస్థ ‘ఆక్యూ వెదర్’ అంచనా వేసింది.టాస్ సమయం నుంచే వర్షం!డర్హామ్‌లో బుధవారం రాత్రి వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదని తెలుస్తోంది. మ్యాచ్ టాస్ పడే సమయానికి (రాత్రి 9:30 గంటలకు) వర్షం కురిసే అవకాశం 49 శాతంగా ఉందని అంచనా. ఇక రాత్రి 10 గంటల నుంచి మ్యాచ్ ముగిసే వరకు వర్షం పడే అవకాశం 49 నుండి 56 శాతానికి పైగా పెరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి.

రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్: ‘టాపిక్ నీ ఇష్టం.. ప్లేస్ నీ ఇష్టం.. నేను రెడీ!

ఒకవేళ వర్షం తీవ్రమైతే ఓవర్లను కుదించే అవకాశం లేదా మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే ప్రమాదం కూడా ఉంది. మరోవైపు, భారత తుది జట్టు ఎంపికపై కూడా ఆసక్తికర వార్త ప్రచారంలో ఉంది. ఈ మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కకపోవచ్చని సమాచారం. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ అతడు ఆడే అవకాశం దక్కించుకోలేక బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరిగే ఈ కీలక పోరులో కూడా అతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆగ్రహంతో రగిలిపోతున్న కోమటిరెడ్డి!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు