Homeఆంధ్ర ప్రదేశ్కొడుకు దేవాన్ష్ పై లోకేష్ సంచలన వ్యాఖ్యలు!

కొడుకు దేవాన్ష్ పై లోకేష్ సంచలన వ్యాఖ్యలు!

క్రైమ్ మిర్రర్,అమరావతి:- తన కుమారుడు దేవాన్ష్‌తో తనకున్న అనుబంధం గురించి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. విద్యార్థులతో జరిగిన ఒక ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు సరదా వ్యాఖ్యలు చేశారు.అన్నదమ్ముల్లా కొట్టుకుంటాం..తాను, తన కొడుకు దేవాన్ష్ ఇంట్లో ఎప్పుడూ అన్నదమ్ముల్లా కొట్టుకుంటూ ఉంటామని లోకేశ్ సరదాగా చెప్పారు. దేవాన్ష్ కు తానెప్పుడూ ఎలాంటి సలహాలు ఇవ్వనని, వాడి బాధ్యత అంతా తన సతీమణి బ్రాహ్మణియే చూసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. అలాగే, దేవాన్ష్ తో చెస్ ఆడి తాను ఓడిపోవడం వల్ల తన పరువంతా పోయిందని లోకేశ్ ఫన్నీ కామెంట్స్ చేశారు.విద్యా వ్యవస్థపై స్పందన..ఇదే సందర్భంగా తన విద్యాభ్యాసం గురించి కూడా లోకేశ్ మాట్లాడారు. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో కంటే అమెరికా విద్యా వ్యవస్థలోనే తాను ఎక్కువగా సక్సెస్ అయ్యానని విద్యార్థులతో జరిగిన ఈ ఇంటరాక్షన్‌లో ఆయన వెల్లడించారు.

Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేష్ చేతిలో రూ.15 లక్షల వాచ్.. దాని వెనుక అసలు కథ ఇదే!

BIG BREAKING: బీజేపీలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…!?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు