హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ది ఇండియా స్టోరీ సినిమా టీజర్ విడుదలైంది. చెట్టన్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రేయాస్ తల్పాడే, త్రిష శారద, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 24న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన టీజర్లో కల్తీ ఆహార పదార్థాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ప్రమాదాలను ప్రధానంగా చూపించారు. మనం రోజూ వాడే నిత్యావసర వస్తువులు, పాలు వంటి ఆహార పదార్థాల్లో జరుగుతున్న కల్తీ కారణంగా అమాయకుల ప్రాణాలు ఎలా ప్రమాదంలో పడుతున్నాయనే అంశాన్ని దర్శకుడు హైలైట్ చేశారు.
Also Read:Team India: ఐర్లాండ్ చేతిలో టీమిండియాకు షాక్.. తొలి టీ20లో 34 పరుగుల తేడాతో ఘోర పరాభవం!
టీజర్ ప్రకారం, కల్తీ ఆహారం వల్ల ఓ చిన్నారికి ప్రాణాంతక క్యాన్సర్ సోకుతుంది. తన కూతురికి న్యాయం చేయాలని ఓ తండ్రి (శ్రేయాస్ తల్పాడే) పోరాటం ప్రారంభిస్తాడు. ఈ కేసులో న్యాయవాదిగా కాజల్ అగర్వాల్ రంగంలోకి దిగి, నిజాలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సమాజానికి సంబంధించిన కీలక సమస్యను కోర్టు డ్రామాతో మిళితం చేసి సినిమా రూపొందించినట్లు టీజర్ స్పష్టం చేస్తోంది.
Also Read:Heavy Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!
ఇది ప్రతి భారతీయ కుటుంబానికి సంబంధించిన కథ అనే సందేశంతో ముగిసే టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. భావోద్వేగాలతో పాటు సామాజిక అంశాన్ని బలంగా ప్రస్తావించిన ఈ సినిమా, థ్రిల్లింగ్ కోర్ట్‌రూమ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. కాజల్ అగర్వాల్ చాలా రోజుల తర్వాత ఓ బలమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. జూలై 24న విడుదల కానున్న ది ఇండియా స్టోరీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.