హైదరాబాద్,క్రైమ్ మిర్రర్: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ వరల్డ్ చిత్రం వారణాసి పై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఫ్రాన్స్‌లో జరిగిన ఆన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్ సందర్భంగా రాజమౌళి ఈ సినిమాపై కీలక అప్డేట్ ఇచ్చారు. ఇటీవల మహేష్ బాబు కుటుంబంతో కలిసి విదేశీ విహారయాత్రకు వెళ్లగా, మరోవైపు రాజమౌళి తన కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయతో కలిసి ఫ్రాన్స్‌లోని ఈ అంతర్జాతీయ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. అక్కడ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, వారణాసి షూటింగ్ మరో మూడు నుంచి నాలుగు నెలల్లో పూర్తవుతుందని వెల్లడించారు.
Also Read:Nalgonda Family Murder Case: నలుగురిని చంపింది ఒక్కడే.. వీడిన నల్లగొండ ఫ్యామిలీ మర్డర్ కేసు మిస్టరీ!
రాజమౌళి మాట్లాడుతూ.. సినిమాలోని ప్రధాన యాక్షన్ సీక్వెన్స్‌ల చిత్రీకరణ ఇప్పటికే పూర్తైంది. ఇప్పుడు కథను ముందుకు తీసుకెళ్లే అనుసంధాన సన్నివేశాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. 2026 సెప్టెంబర్ లేదా అక్టోబర్ మొదటి వారానికల్లా మొత్తం షూటింగ్ పూర్తవుతుందని ఆశిస్తున్నాం అని తెలిపారు. ఈ సినిమాను ఐమాక్స్ ఫార్మాట్‌కు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందిస్తున్నామని రాజమౌళి చెప్పారు. కేవలం ఐమాక్స్‌లో చూపించేందుకు కాదు, ఆ ఫార్మాట్‌కు తగ్గట్టుగానే చిత్రీకరణ జరుగుతోందన్నారు. అయితే కథలో ఎలాంటి మార్పులు చేయలేదని, కొన్ని చిన్న సాంకేతిక మార్పులతోనే విజువల్ అనుభూతిని మరింత మెరుగుపరుస్తున్నామని వివరించారు.
Also Read:US Strikes: ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. మళ్లీ ఉద్రిక్తంగా మిడిల్ ఈస్ట్!
మన కళ్లకు సినిమా స్కోప్ ఫార్మాట్ అలవాటు. కానీ వారణాసి ని ఐమాక్స్, సినిమా స్కోప్ రెండింటికీ సరిపోయేలా ఫ్రేమ్ చేయాలని మొదటి నుంచే ప్లాన్ చేశాం. మొదట్లో కొన్ని సర్దుబాట్లు చేయాల్సి వచ్చినా, తర్వాత మాకు పూర్తి క్లారిటీ రావడంతో పని సులభమైంది అని రాజమౌళి తెలిపారు. టెక్నాలజీ అనేది కథ చెప్పడానికి ఒక సాధనం మాత్రమేనని, ఎంత పెద్ద విజువల్స్ ఉన్నా కథ, భావోద్వేగాలకే తాను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని రాజమౌళి స్పష్టం చేశారు. సాంకేతికంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతీయ చిత్రాల్లో వారణాసి ఒకటిగా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Also Read:Heavy Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!
ఇటీవల విలన్ పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమా షూటింగ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మహేష్ బాబుతో కలిసి ఒకే షాట్ కోసం దాదాపు 90కి పైగా టేకులు తీసుకున్నామని, రాజమౌళి పర్ఫెక్షన్ కోసం ఎంత కష్టపడతారో ప్రత్యక్షంగా చూశానని చెప్పారు.
Also Read:Team India: ఐర్లాండ్ చేతిలో టీమిండియాకు షాక్.. తొలి టీ20లో 34 పరుగుల తేడాతో ఘోర పరాభవం!
వారణాసి చిత్రంలో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించనున్నారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన శ్రీరాముడి పాత్రలోనూ కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ భారీ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తయితే, విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చిత్రబృందానికి తగిన సమయం లభించనుంది.
Also Read:Prabhas-Anushka: ప్రభాస్-అనుష్క మళ్లీ కలిసి.. ఫ్యాన్స్ కు పండగే పండగ!