Homeక్రీడలుముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా గుడ్‌బై? ట్రేడింగ్‌పై కన్నేసిన కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్!

ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా గుడ్‌బై? ట్రేడింగ్‌పై కన్నేసిన కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఆ జట్టును వీడటం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. రాబోయే ఐపీఎల్ సీజన్‌కు ముందు పాండ్యాను వదులుకోవడానికి ముంబై ఫ్రాంచైజీ సిద్ధమైనట్లు క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.ఆసక్తి చూపుతున్న రెండు జట్లు..హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ ద్వారా లేదా భారీ క్యాష్ పేమెంట్ (నగదు చెల్లింపు) ద్వారా దక్కించుకునేందుకు కోల్‌కతా నైట్ రైడర్స్ , రాజస్థాన్ రాయల్స్ జట్లు తీవ్ర ఆసక్తి కనబరుస్తున్నాయి. దీనిపై ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఇప్పటికే కేకేఆర్‌తో ప్రాథమిక చర్చలు జరిపినట్లు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ (PTI) వెల్లడించింది.

సంచలన ఆటగాళ్ల మార్పిడి (ట్రేడింగ్ ఆఫర్స్):- ఈ మెగా ట్రేడింగ్‌లో భాగంగా పాండ్యా కోసం కీలక ఆటగాళ్లను వదులుకునేందుకు ఆయా ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పాండ్యా కోసం కేకేఆర్ తమ స్టార్ ప్లేయర్లు అజింక్య రహానే, రింకూ సింగ్‌లను వదులుకునేందుకు సైతం వెనకాడటం లేదని తెలుస్తోంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్.. తమ యువ డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను ట్రేడింగ్ ఆఫర్‌గా ముంబై ముందు ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి.కెప్టెన్సీ ఛాన్స్:ఒకవేళ ఈ ట్రేడింగ్ విజయవంతమైతే, కేకేఆర్ లేదా రాజస్థాన్.. ఈ రెండిట్లో పాండ్యా ఏ జట్టుకు వెళ్లినా.. అతనికి ఆ జట్టు కెప్టెన్సీ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

El Nino Impact: ఎల్‌నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణ సహా 111 జిల్లాలకు కరువు!

Nivetha Pethuraj: పెళ్లి ఆగితే లక్ కలిసి వస్తుందా? నివేతా పేతురాజ్ కెరీర్‌పై ఆసక్తికర చర్చ!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు