Homeఆంధ్ర ప్రదేశ్ఏపీలో అంత‌రాష్ర్ట ముఠా క‌ద‌లిక‌లు...! ఆచూకి తెలిస్తే స‌మాచారం ఇవ్వాల‌ని పోలీసుల‌ విజ్ఞ‌ప్తి...!

ఏపీలో అంత‌రాష్ర్ట ముఠా క‌ద‌లిక‌లు…! ఆచూకి తెలిస్తే స‌మాచారం ఇవ్వాల‌ని పోలీసుల‌ విజ్ఞ‌ప్తి…!

ఏలూరు, క్రైమ్‌మిర్ర‌ర్‌: మధ్యప్రదేశ్ కు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా కదలికలపై ప్రకాశం, ఏలూరు జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ధార్ జిల్లాకు చెందిన నిందితుల ముఠా రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు సమాచారం అందడంతో పలు ప్రాంతాల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. చీరాలలో గతంలో చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్న ముఠాలతో ఈ గ్యాంగ్ కు సంబంధాలు ఉండొచ్చన్న అనుమానంతో స్థానిక నేరస్థుల కదలికలపైనా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ చీరాల టూ టౌన్ సీఐ శశికుమార్ అనుమానితుల ఫొటోలతో పోస్టర్లను విడుదల చేశారు. పోస్టర్లలో ఉన్న వ్యక్తులు చోరీలు, దోపిడీ కేసుల్లో నిందితులని, వారి ఆచూకీ తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Also Read:సంక్రాంతి-2027: బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ అగ్ర హీరోల మహా సమరం!

పర్చూరులోనూ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పర్చూరు ఎస్ఐ పులి గోపి మాట్లాడుతూ, ధార్ గ్యాంగ్ కదలికలపై రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తత కొనసాగుతోందని తెలిపారు. ఏలూరు రైల్వే స్టేషన్ పరిసరాల్లో ముగ్గురు అనుమానితుల కదలికలు సీసీ కెమెరాల్లో నమోదైనట్లు చెప్పారు. గ్రామాలు, పట్టణాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ప్రజల సహకారంతో ఈ ముఠా కదలికలను గుర్తించి నేరాలను అరికట్టేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు

Also Read:యువతను కాంగ్రెస్ నిలువునా ముంచింది: తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు