Homeక్రైమ్ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం...! రూ.40వేలు లంచం తీసుకుంటూ చిక్కిన పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి...

ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం…! రూ.40వేలు లంచం తీసుకుంటూ చిక్కిన పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి…

కర్నూలు, క్రైమ్‌మిర్ర‌ర్‌: ప్రజలకు సేవలు అందించాల్సిన బాధ్యతలో ఉన్న ఓ గ్రామపంచాయతీ కార్యదర్శి, ప్రభుత్వ పనులకు ధర కట్టి చివరకు ఏసీబీ వలలో చిక్కాడు. ఇంటి పన్ను నమోదు, గృహ నిర్మాణ అనుమతి (అప్రూవల్‌) కోసం రూ.50 వేల లంచం డిమాండ్ చేసిన వెల్దుర్తి మేజర్‌ గ్రామపంచాయతీ కార్యదర్శి కే.లక్ష్మీనాథ్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.40 వేల లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Also Read:Vaibhav Suryavansh: దంబుల్లా మ్యాచ్ లో కొట్లాట.. వైభవ్‌ కు బీసీసీఐ షాక్!

ఏసీబీ అధికారుల కథనం మేరకు…

వెల్దుర్తికి చెందిన సంధ్యపోగు సతీష్ తన ఇంటి పన్ను నమోదు చేయించుకోవడంతో పాటు గృహ నిర్మాణానికి సంబంధించిన అనుమతులు పొందేందుకు గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఆశ్రయించాడు. సంబంధిత ప్రక్రియ పూర్తి చేయాలంటే రూ.50 వేల లంచం ఇవ్వాలని కార్యదర్శి లక్ష్మీనాథ్‌ డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపించాడు. పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా పని ముందుకు సాగకపోవడంతో చివరకు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

Also Read:PM Kisan Update: రైతుల ఖాతాల్లో మళ్లీ పీఎం కిసాన్ నగదు.. ఎప్పుడు వేస్తారంటే?

పక్కా సమాచారంతో ఫిర్యాదు అందుకున్న కర్నూలు రేంజ్‌ ఏసీబీ అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టి లంచం డిమాండ్‌ నిజమేనని నిర్ధారించారు. అనంతరం బాధితుడికి సూచనలు ఇచ్చి కార్యదర్శికి డబ్బు అందజేసేలా ప్రణాళిక రూపొందించారు. ఈ క్రమంలో రూ.40 వేల అడ్వాన్స్‌ మొత్తాన్ని కార్యదర్శికి అందజేస్తుండగా, మాటు వేసిన అధికారులు దాడి చేసి అతడిని పట్టుకున్నారు.

Also Read:Trump Praises PM Modi: మోదీ టఫ్ నెగోషియేటర్.. ప్రధానిపై ట్రంప్ ప్రశంసలు!

తాజావార్తలు