Homeక్రైమ్జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం...!కాన్పు చేసిన న‌ర్సు..త‌ల్లి, బిడ్డా మృతి...

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం…!కాన్పు చేసిన న‌ర్సు..త‌ల్లి, బిడ్డా మృతి…

భద్రాద్రి కొత్తగూడెం, క్రైమ్‌మిర్ర‌ర్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభూనిగూడెం గ్రామంలో వనజ(20) అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అక్కడి నర్సు సాధారణ కాన్పు చేసింది.

Also Read:ఒకే కారులో ఇద్దరు మాజీ భార్యలు, కాబోయే భార్యతో అమీర్ ఖాన్.. నువ్వు మామూలోడివి కాదు మాస్టారూ!

కాన్పు తర్వాత శిశువు అపస్మారక స్థితిలోకి వెళ్లడం గమనించి ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు. కాన్పు అనంతరం తల్లికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం తమ కుటుంబంలో తీరని శోకాన్ని నింపిందని బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు.

Also Read:Vaibhav Suryavansh: దంబుల్లా మ్యాచ్ లో కొట్లాట.. వైభవ్‌ కు బీసీసీఐ షాక్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు