Homeఆంధ్ర ప్రదేశ్ఇంటింటికి టిడిపి.. ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించిన లోకేష్...!

ఇంటింటికి టిడిపి.. ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించిన లోకేష్…!

Crime Mirror, AP State Bureau: రాష్ట్రంలో రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈనెల 25 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనుంది.

ఈ కార్యక్రమంలో భాగంగా గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి, తీసుకువచ్చిన ప్రాజెక్టులు, కల్పించిన ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి ప్రజలకు వివరించనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం ఆగస్టు 10వ తేదీ వరకు కొనసాగుతుంది.

Also Read: ఐఏఎఫ్ అధికారి భార్యపై అత్యాచారం…! బ్లాక్ మెయిల్‌ – Crime Mirror

అంటే మొత్తంగా 45 రోజులపాటు టిడిపి శ్రేణులన్నీ జనంలోకి వెళ్లాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ విజయాలను వెల్లడించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ఆదేశించారు.

వారానికి నాలుగు రోజులు జనంలో జరగాల్సిందేనని నాయకులకు కూడా మంత్రు లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. వీలైతే సైకిల్ పై వెళ్లేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఎక్కువమందిని కలిసే అవకాశం దీనివల్ల లభిస్తుందని మంత్రి ఆదేశాలు దారి చేశారు. అలాగే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి జరిగిన అభివృద్ధి పనులతో కూడిన కరపత్రాన్ని తయారు చేసుకోవాలని పార్టీ ఆదేశించింది.

Also Read: అనిత వర్సెస్ అమర్నాధ్…!టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్‌… – Crime Mirror

ఇందులో తప్పనిసరిగా కూటమి ప్రభుత్వా రెండేళ్ల విజయాలు ఉండాలి. నియోజకవర్గ, గ్రామస్థాయిలో ఏ సంక్షేమ పథకం ద్వారా ఏ ఏ వర్గాలకు ఎంత లబ్ధి చేకూరింది అనే విషయాలు ఇందులో ఉండాలని పార్టీ ఈ మేరకు సూచనలు జారీ చేసింది.

45 రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధించి కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఏ రోజు ఎవరు జనంలోకి వెళ్లారని వివరాలు సేకరించే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు పార్టీ వెల్లడించింది. జనంలోకి వెళ్లే విషయంలో ఓటమి పార్టీలుగా ఉన్న జనసేన, బిజెపి క్యాడర్ను కూడా కలుపుకుని వెళ్లాలని ఆదేశించింది పార్టీ అగ్రనాయకత్వం.

  • సర్ పై అప్రమత్తత అవసరం.. ఒక్క ఓటు వదలొద్దు అన్న లోకేష్..

స్పెషల్ ఇంటెన్సు రివిజన్ పై ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని పార్టీ అధినాయకత్వం కేడర్కు సూచించింది. జనంలోకి వెళితే కొత్త పింఛన్లు అడుగుతున్నారని, గ్రామాల్లో చిన్న చిన్న పనులు కోసం తమకు కొంత నిధులు ఇవ్వాలని ఈ సందర్భంగా పలువురు నాయకులు మంత్రి నారా లోకేష్ కు సూచించారు.

Also Read: దారుణం…గురుకుల మ‌హిళ లెక్ష‌ర‌ర్‌కు వేధింపులు…! ఫిర్యాదుతో కేసు న‌మోదు – Crime Mirror

ఇదే సమస్య తనకు కూడా ఉందన్న ఆయన.. ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని సీఎంను కోరుతానని వెల్లడించారు. ఇకపోతే 2014 నుంచి 2019 మధ్య చేసిన అభివృద్ధి పనులు చెప్పుకోక పోవడం వల్లనే ఓటమి చెందామని.. అటువంటి పరిస్థితి ఈసారి ఎదురు కాకుండా ఉండాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

ప్రజల్లో నిరంతరం తిరగడం ద్వారానే ప్రజా మద్దతు లభిస్తుందన్న మంత్రు లోకేష్.. ఇంటింటికి టిడిపి కార్యక్రమాన్ని అమలు చేస్తున్న తీరును బేరీజు వేస్తూ ర్యాంకులు కూడా ఇవ్వనున్నట్లు ఆ పార్టీ నాయకులకు వెల్లడించారు.

Also Read: TG20కు బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్‌ దేవరకొండ.. – Crime Mirror

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు