Homeక్రైమ్ఇలాంటి స్నేహితులతో జాగ్రత్త.. అప్పు ఇవ్వలేదని స్నేహితుని దారుణ హత్య!!

ఇలాంటి స్నేహితులతో జాగ్రత్త.. అప్పు ఇవ్వలేదని స్నేహితుని దారుణ హత్య!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : స్నేహం అంటే నమ్మకం.. ఆపదలో అండగా నిలబడటం. కానీ నల్లగొండ జిల్లాలో జరిగిన ఓ ఘటన మాత్రం స్నేహం అనే బంధానికే మచ్చ తెచ్చింది. అప్పుగా డబ్బు అడిగితే ఇవ్వలేదనే కోపంతో స్నేహితుడినే హత్య చేసిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన పూర్ణాన్ (37), ఆరీఫ్ (26) నల్లగొండలోని బొట్టుగూడ, మేథర్ కాలనీలో కొంత కాలంగా నివాసముంటూ బైక్ పై తిరుగుతూ చీరల వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అదే ప్రాంతంలో ఉంటూ ఆడ వేశంలో ఎల్లమ్మ పండగలు చేసే బోధ్ సాయికుమార్ తో స్నేహం పెంచుకున్నారు. తరచూ కలిసి తిరగడం, మద్యం సేవించడం వల్ల ముగ్గురి మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ చనువుతో సాయికుమార్ ను ఫుర్ఖాన్ రూ.30వేలు అప్పు అడిగాడు. అయితే సాయి కుమార్ డబ్బు ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో అతనిపై ఫుర్ధాన్ కక్ష పెంచుకున్నాడు. ఆ తర్వాత సాయికుమార్‌ను హత్య చేయాలని ఫుర్ఖాన్ కుట్ర పన్నాడు. ఈ నెల 8న మరో మిత్రుడు ఆరీఫ్ తో కలిసి కేశరాజుపల్లిలోనీ వెంచర్ లో మద్యం తాగుదామని పథకం ప్రకారం సాయి కుమార్ ను.. ఫుర్ఖాన్ పిలిచాడు. ముగ్గురూ కలిసి మద్యం తాగుతూ.. డబ్బు అత్యవసరముందని మరోసారి ఫుర్ఖాన్ ను 30 వేల రూపాయలను అప్పుగా అడిగాడు. సాయి కుమార్ ఇవ్వకపోవడంతో ఆవేశంలో ఇద్దరు కలిసి బండరాయితో సాయి కుమార్ తలపై కొట్టి హత్య చేశారు. చేతికి, మెడకు ఉన్న ఆరు తులాల బంగారం, ఫోన్ తో బైక్ పై పరారయ్యారు. దొంగిలించిన బంగారాన్ని అమ్మేందుకు విజయవాడలో ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని ఒప్పుకోవడంతో బంగారం, బైక్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని నల్లగొండ జిల్లా ఏఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాం రెడ్డి చెప్పారు. ఆధారాలు లేకుండా తప్పించుకోవచ్చని భావించినా, సెల్‌ఫోన్ ట్రాకింగ్, కాల్ డేటా వంటి సాంకేతిక ఆధారాలతో కటకటాల పాలయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు