Homeతెలంగాణరమేష్ కుటుంబానికి అండగా కాంగ్రెస్ నాయకులు – రూ.10 వేల ఆర్థిక సహాయం..!

రమేష్ కుటుంబానికి అండగా కాంగ్రెస్ నాయకులు – రూ.10 వేల ఆర్థిక సహాయం..!

క్రైమ్ మిర్రర్, మాడ్గులపల్లి, జూన్ 13: నల్గొండ జిల్లా, మాడ్గులపల్లి మండలము, పాములపహాడ్ గ్రామానికి చెందిన యల్లావుల రమేష్ అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అతనికి ఇద్దరు కుమార్తెలు వున్నారు. అతని కుటుంబం పేద కుటుంబం కావడం తో గ్రామం కాంగ్రెస్ నాయకులూ స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మ రెడ్డి కుమారుడి సాయిప్రసన్న రెడ్డి కి  విషయం తెలిపారు.

Also Read: “8 ఏళ్ల కొడుకు ముందే తండ్రి ఘోర నిర్ణయం… సెల్ఫీ వీడియోలో షాకింగ్ ఆరోపణలు!

వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరడం తో వెంటనే ఆర్థిక సహాయం గా 10,000 వేల రూపాయలు ఇవ్వమని ఇవ్వడంతో ఈ నేపథ్యంలో శనివారం పాములపహాడ్ గ్రామ సర్పంచ్ అంజయ్య, కాంగ్రెస్ గ్రామ శాఖ నాయకులు రమేష్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.. అనంతరం రూ.10,000 ఆర్థిక సహాయాన్ని వారికి అందజేశారు.

Also Read: Katrina Kaif: ‘చాందినీ బార్ 2’లో కత్రినా కైఫ్.. అభిమానులకు పండగే!

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రమేష్ కుటుంబానికి ఈ కష్టకాలంలో తాము అండగా నిలుస్తామని, భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంటామని నాయకులు భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ వారికి మానసికంగా తోడ్పాటును అందించారు.

గ్రామ ప్రజలు కూడా రమేష్ కుటుంబానికి తమ వంతు సహాయం అందించాలని నాయకులు పిలుపునిచ్చారు.

Also Read: New Diesel Rules: డీజిల్‌పై కేంద్రం కొత్త ఆంక్షలు.. ఇక రోజుకు ఎన్ని లీటర్లు పోస్తారంటే?

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంజయ్య, ఉపసర్పంచ్ ఎల్క మాధవరెడ్డి, గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షులు హరికృష్ణ రెడ్డి, ఉపాధ్యక్షులు మాండ్ర గిరి యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల పోలిశెట్టి ఉపేందర్, మామిడి సైదులు, గుండేపురి లక్ష్మినర్సు, వల్కి వెంకన్న, దశరథ, కునుకుంట్ల సతీష్, లచ్చిరెడ్డి, వర్కాల యాదగిరి, గరువయ్య, శోభన్ బాబు, ప్రభాకర్, నవీన్, ఠాగూర్, ధర్మారెడ్డి, వెంకటాచారి, కార్తిక్‌తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు, BLR అభిమానులు పాల్గొన్నారు.

Also Read: బంగాళదుంపలు తింటే ఈ ఆరోగ్య ప్రమాదాలు తప్పవా..?

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు