Homeతెలంగాణఈ సారి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు..మాజీ మంత్రి హరీష్ రావు

ఈ సారి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు..మాజీ మంత్రి హరీష్ రావు

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. రెండున్నారేళ్ల పాలన పూర్తి చేసుకున్న రేవంత్.. 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని పదే పదే చెబుతున్నారు. అటు బీఆర్ఎస్ ఈ సారి గెలుపు తమదేనని ధీమాగా ఉంది. బీజేపీ కొత్త వ్యూహాలతో రాష్ట్రంతో వచ్చే ఎన్నికల కోసం సమాయత్తం అవుతోంది. ఈ క్రమంలో కేసీఆర్ బస్సు యాత్ర.. కేటీఆర్ పాదయాత్ర కు సిద్దం అవుతున్నారు. కాగా.. తాజాగా హరీష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి. రేవంత్ రెడ్డి నియంత పాలనకు రోజులు దగ్గర పడ్డాయని హరీష్ హెచ్చరించారు. ఈ సారి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌‌ రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు అధికారం కోల్పోయాయని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి.. జూబ్లీహిల్స్ ప్యాలెస్ చాలదని వంద కోట్ల రూపాయిలతో ఇంకో ప్యాలస్ నిర్మించారని ఆరోపించారు. ఇంటి సమీపంలో హెలికాప్టర్ చాలదని ఐదు కోట్ల రూపాయిలతో ఎయిర్ బస్ తెచ్చుకుంటున్నారని మండిపడ్డారు.

ఫుట్ బాల్ సోకుల కోసం మెస్సీకి రూ.100 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. అందాల పోటీల కోసం మరో రూ.100 కోట్లు ఖర్చు చేశారని వివరించారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఇక్కడి నుంచి అక్కడికి మూటలు పంపటానికి నగదు ఉంటుందన్నారు. కానీ విద్యార్థులు, రైతులకు ఇవ్వటానికి మాత్రం డబ్బులు ఉండవా? అంటూ సీఎం రేవంత్ రెడ్డి‌కి హరీశ్ రావు నిలదీసారు. కాగా, ఇప్పటికే హరీష్ ఫ్యూచర్ సిటీ పైన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేసి తీరుతామని హరీష్ తాజాగా వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఔషధ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రతిపాదించిన ‘ఫార్మాసిటీ’ కోసం స్వయంగా తాను కూడా 17 ఎకరాల భూమిని ఇచ్చానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పరిశ్రమల స్థాపన కోసం సేకరించిన విలువైన రైతుల భూములను, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మరియు ల్యాండ్ పూలింగ్ కోసమే వాడుతోందని, దీనిని తాము ఎంతమాత్రం సహించబోమని హరీష్ రావు హెచ్చరించారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు హరీష్ వ్యాఖ్యల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు