క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మైనర్ల డ్రైవింగ్.. దేశంలో పెద్ద సమస్యగా మారిందని, తల్లిదండ్రులు వారికి వాహనాలు కొనిస్తున్నారని.. అందువల్లే ఇబ్బందులు వస్తున్నాయని. డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. పోలీసుస్టేషన్‌కు వచ్చిన బాధితులతో ఫ్రెండ్లీగా ఉంటామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు. రౌడీషీటర్లు, తదితర నేరస్తుల విషయంలో కఠినంగానే ఉంటామని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బంది పెట్టే ఎవరినీ కూడా వదలబోమని స్పష్టం చేశారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో డీజీపీ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోషం గ్రామసభలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో నక్సలైట్ల సమస్య లేదని తెలిపారు. దేశవ్యాప్తంగా ఏడాది కాలంలో రోడ్డుప్రమాదాల్లో..1.70 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని డీజీపీ చెప్పుకొచ్చారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్‌పై ప్రజలు యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు.అన్నీ సమస్యలు పోలీసులతోనే పరిష్కారం కావని… ప్రజల సహకారం చాలా అవసరమని చెప్పుకొచ్చారు. భూపాలపల్లి, ఏటూరు నాగారం, నర్సంపేట, ఆదిలాబాద్ తదితర అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు ఉందని ప్రస్తావించారు. గంజాయి సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందవని, రైతుబంధు కూడా నిలిపి వేస్తున్నామని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.