Hometelanganaగంజాయి నిర్మూలనకు విస్తృత తనిఖీలు...!

గంజాయి నిర్మూలనకు విస్తృత తనిఖీలు…!

రామకృష్ణాపూర్, జూన్ 10 (క్రైమ్ మిర్రర్): గంజాయి వాడకం, అక్రమ రవాణాను అరికట్టేందుకు రామకృష్ణాపూర్‌లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ముందస్తు సమాచారం మేరకు అనుమానితుల ఇళ్లలో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సహాయంతో సోదాలు చేపట్టారు.

గంజాయి వినియోగం, విక్రయాలకు పాల్పడే వారు వెంటనే మానుకోవాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని పట్టణ ఎస్సై జె. శ్రీధర్ హెచ్చరించారు. గంజాయి నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ బృందం నిరంతరం నిఘా కొనసాగిస్తోందన్నారు.

ఎక్కడైనా గంజాయి వినియోగం లేదా విక్రయాలు జరుగుతున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించి, గంజాయి రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు