Crime Mirror, Court Updates: పెళ్లికి ముందుకు ఇష్టంతో పెట్టుకునే శారీరక సంబంధం నేరం కాదంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. ఈ తరహా సంబంధాలు వారి జీవితానికి ఎటువంటి బ్లాక్ మార్క్ కాదంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పును చెప్పింది. తెలంగాణకు చెందిన ఒక యువకుడి కేసులో పదేళ్ల పోరాటానికి న్యాయం చేస్తూ సుప్రీం కోర్టు ఈ తీర్పును ఇచ్చింది.
ఈ తీర్పు ప్రస్తుతం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. తెలంగాణకు చెందిన గాజుల తిరుపతి అనే యువకుడు 2014లో పోలీస్ ఆఫీసర్ కావాలనే లక్ష్యంతో తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగించాడు. పోలీస్ అయ్యేందుకు ఒకవైపు శిక్షణ తీసుకుంటూ ప్రిపరేషన్ సాగించేవాడు. అదే సమయంలో తిరుపతి ఉంటున్న ప్రాంతంలోనే ఉన్న యువతితో ప్రేమాయణం సాగించాడు.
Also Read: ఖమ్మంలో మానవ మృగం.. 12 ఏళ్ల బాలికపై 45 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి
అయితే, కొన్ని కారణాలు వల్ల వారిద్దరి మధ్య బంధం తెగిపోయింది. దీంతో ఆ యువతి తిరుపతి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ పోలీసులకు అప్పట్లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులో లైంగిక దాడి ఆరోపణలు మాత్రం చేయలేదు. ఆ తరువాత 2015లో ఇరువర్గాలు లోక్ అదాలత్‌ను ఆశ్రయించి, పరస్పర అవగాహనతో ఈ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకున్నాయి. ఇక్కడితో ఈ సమస్య ముగిసిందని అంతా భావించారు. కానీ, ఇక్కడే అసలైన ట్విస్ట్ యువకుడికి ఎదురైంది.
ఉద్యోగం రావడంతో తెరపైకి వచ్చిన కేసు..
యువతితో నెలకొన్న సమస్య పరిస్కారం కావడంతో యువకుడు తాను కలలు కన్నట్టుగానే పోలీస్ ఉద్యోగానికి మరోసారి ప్రిపరేషన్ సాగించాడు. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌కు సిద్ధమైన తిరుపతి అన్ని పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఫామ్‌ను భర్తీ చేసే సమయంలో కూడా తిరుపతి నిజాయితీగా వ్యవహరించాడు.
2014లో తనపై నమోదైన కేసు వివరాలను, లోక్ అదాలత్‌లో పరిష్కరించుకున్న తీరును అందులో మెన్షన్ చేశాడు. తనపై ఎటువంటి నేర చరిత్ర లేకపోయినా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మాత్రం దీనిపై కఠినంగా వ్యవహరించింది. పెళ్లి నిశ్చయించి తప్పుకోవడం అంటే నైతిక ప్రవర్తన సరిగా లేకపోవడమేనని భావిస్తూ అతడి ఎంపికను రద్దు చేసింది.
Also Read: పెరిగిన ఎన్డీఏ బలం.. టీఎంసీ రెబల్ ఎంపీల మద్దతుతో బలోపేతం.!
దీనిపై తిరుపతి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. సింగిల్ జడ్జి అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. దీనిపై పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అప్పీల్‌కు వెళ్లడంతో డివిజన్ బెంచ్ తీర్పును రివర్స్ చేసింది. అభ్యర్థి అర్హతను నిర్ణయించే తుది హక్కు ప్రభుత్వానిదేనని పేర్కొంది. దీంతో తిరుపతి చివరిగా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఈ కేసును నిశితంగా పరిశీలించి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోవడం అంటే నేరం అంగీకరించినట్టు కాదన్న బెంచ్.. బోర్డు ఆలోచనా విధానం ఆధునిక సమాజానికి ఆమడ దూరంలో ఉందని వ్యాఖ్యానించంది.
Also Read: ఏపీలో అట్టహాసంగా యోగాంధ్ర వేడుకలు.. చీఫ్ గెస్ట్ గా రాందేవ్ బాబా
ప్రస్తుత కాలంలో పెళ్లికి ముందు ఇద్దరు వయోజనులు పరస్పర సహకారంతో బంధాన్ని కొనసాగించడం సాధారణమన్న బెంచ్.. ఆ బంధం పెళ్లి వరకు వెళ్లినంత మాత్రాన అభ్యర్థి నైతిక ప్రవర్తన చెడదనే ముద్ర వేయలేమని స్పష్టం చేసింది. తిరుపతిపై ఉన్న ఆరోపణలను తొలగిస్తూ అతనికి వెంటనే కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వాలని రిక్రూట్మెంట్ బోర్డును సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో సుదీర్ఘకాలంగా చేస్తున్న పోరాటానికి న్యాయం దక్కినట్టు అయింది. సుప్రీం కోర్టు తీర్పుతో అయినా తిరుపతికి ఉద్యోగం దక్కుతుందో? లేదో.? చూడాలి.
Also Read: హైదరాబాద్ రియల్ ధమాకా.. మరో మెగా ల్యాండ్ వేలానికి సిద్ధమైన హెచ్ఎండీఏ!!