చండూరు, క్రైమ్ మిర్రర్: ఓ లాడ్జిలో పేకాట ఆడుతున్నారు అనే సమాచారం రావటంతో శుక్రవారం రాత్రి పోలీసులు ఆ లాడ్జి పై ఒక్కసారిగా మెరుపు దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకొని కేసు ఫైల్ చేసినట్లు సమాచారం.
నమ్మదగిన సమాచారం మేరకు స్థానిక ఓ లాడ్జ్‌లో కొంత మందిపేకాట ఆడుతున్నట్లుగా సమాచారం రావటంతో గట్టుప్పల ఎస్సై సంజీవరెడ్డి, చండూరు హెడ్ కానిస్టేబుల్ శ్రీరాములు వెళ్లి రైడ్ చేసినట్లు తెలుసుతుంది.
పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేయటంతో పాటు వారి వద్ద రూ.8,300 స్వాదీన సమాచారం. ఈ ఘటన పై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.