Homeఅంతర్జాతీయంమోడీపై సంచలన వ్యాఖ్యలు చేసిన ట్రంప్.. మరోసారి భారత్ పై విమర్శలు.!

మోడీపై సంచలన వ్యాఖ్యలు చేసిన ట్రంప్.. మరోసారి భారత్ పై విమర్శలు.!

క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:- భారత ప్రధాని నరేంద్ర మోడీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా వైట్ హౌస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత్తో పాటు ప్రధాని నరేంద్ర మోడీ గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ గురించి మాట్లాడిన ట్రంప్ ఆయనను ప్రశంసిస్తూనే.. భారత్ పై మాత్రం తన అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. అమెరికాపై అధిక శుంకాలు విధించి భారత్ ఏళ్ల తరబడి లబ్ధి పొందిందని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ ను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. భారత్, అమెరికా మధ్య ఉన్న బలమైన వ్యక్తిగత సంబంధాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొన్న ట్రంప్.. ఆయన తనకు గొప్ప స్నేహితుడిగా అభివర్ణించుకున్నారు. అయితే ఇదే సమయంలో భారత్ పై మాత్రం ట్రంప్ మరోసారి విమర్శలను చేశారు. వాణిజ్య చర్చలకు సంబంధించిన ప్రశ్నకు బదిలీస్తూ భారతదేశ శుంకాల విధానంపై ఆయన విమర్శలు సాగించారు. ఏళ్ల తరబడి అమెరికా నుంచి భారతం చాలా లబ్ది పొందింది అన్న ట్రంప్.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. భారత్ నుంచి మేము భారీగా లాభాలు పొందుతున్నామని పేర్కొన్నారు. కొద్దిరోజుల్లోనే భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

నాలుగు రోజులు పాటు సాగిన చర్చలు..

భారత్ అమెరికా మధ్య వాణిజ్యవా పొందాన్ని ఖరారు చేయడమే లక్ష్యంగా ఇరుదేశాలకు చెందిన ప్రతినిధులు తాజాగా సమావేశమయ్యారు. ఈ సమావేశాలు అనంతరం ఇరుదేశాల మధ్య ఒప్పందాలు కుదురుతాయని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంపు తాజాగా ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఒప్పందానికి సంబంధించిన చర్చిలపై ప్రతిష్టంబను ఏర్పడే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వస్తువుల వాణిజ్యం, కస్టమ్స్ విధానాలు, వాణిజ సౌలభ్యం, టారిఫ్ యేతర చర్యలు, ఆర్థిక భద్రత సహకారం వంటి పలు అంశాలపై చర్చలు సాగినట్లు తాజాగా అమెరికా వెల్లడించింది. భారత్తో స్వేచ్ఛపూరిత వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చల జరిగిన నేపథ్యంలో ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ క్రమంలోనే తదుపరి చర్చలకు ఏ విధంగా జరుగుతాయి అన్న ఆసక్తి నెలకొంది. ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు పట్ల భారత్ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు