-
తెలంగాణ రాష్ట్రంపై ఇంత కక్ష ఎందుకు..?
-
బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్
క్రైమ్ మిర్రర్, మిర్యాలగూడ: ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన రాజకీయ నాయకుల పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, వ్యాపారాలు మొత్తం తెలంగాణ నుండి ఆంధ్రాకు పంపించాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడలోని బీసీభవన్ లో బీసీ సంఘం సమావేశంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్రం పై ఆంధ్ర ప్రాంత నాయకులు పదే పదే విషం చిమ్ముతున్న కూడా వారికి సంబంధించిన వ్యాపార సముదాయాలు మరియు కళాశాల, పాఠశాలలు, సినిమా థియేటర్లు మొత్తం పూర్తిస్థాయిలో ఆంధ్రా ప్రాంతానికి పంపించాలని ఆయన అన్నారు నిత్యం తెలంగాణ రాష్ట్రం మీద విషం చిమ్ము తు తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు.
సిగ్గు లేకుండా వ్యాపారాలు, ఆస్తులు, పాఠశాల లు కళాశాలలో, ఆసపత్రులు తెలంగాణలో ఏర్పాటు చేసుకొని నిత్యం తెలంగాణ ప్రాంత ప్రజల రక్తం తాగుతున్న ఆంధ్ర ప్రాంత నాయకులకు సంబంధించిన వాటిని తక్షణమే ఆంధ్రాకు తరలించకపోతే మాత్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా ఉద్యమం చేశామో అదే తరహాలో మళ్లీ ఉద్యమం చేసి మీ వ్యాపార సామ్రాజ్యాలపై దాడులు చేసే పరిస్థితి ఉంటుందని ఆయన హెచ్చరించారు..
తెలంగాణ నాయకులు సిగ్గు లేకుండా ఆంధ్రాలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు లో తెలంగాణకు సంబంధించిన వాళ్లే తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచినట్టుగా. మాట్లాడిన వ్యక్తులను తెలంగాణలో అడుగుపెట్టనివ్వద్దు అని ఆయన అన్నారు ఎన్నో త్యాగా లు పోరాటాలతో వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి చీడ పురుగుల వల్ల అమర వీరుల త్యాగ ఫలితం వృధా అవుతుందని ఆయన అన్నారు.
ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రంపై నిత్యం కొంతమంది కుట్రలు చేస్తూ తెలంగాణ ప్రజల ఆత్మ అభిమానాన్ని దెబ్బ తీస్తున్నారని. ఆయన అన్నారు ఇలాంటి తెలంగాణ వ్యతిరేకుల్ని గుర్తించి ప్రభుత్వం రాష్ట్రం ప్రయోజనాల దృష్ట్యా వారిని తెలంగాణ రాష్ట్రం నుంచి బహిష్కరించాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ జేఏసీ కన్వీనర్ దాసరాజు జయరాజ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కా నాగేశ్వరరావు, బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శి రవీందర్ గౌడ్, ప్రణయ్, రాము తదితరులు పాల్గొన్నారు..