Homeఆంధ్ర ప్రదేశ్విశాఖపట్నం డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్...!

విశాఖపట్నం డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్…!

విశాఖపట్టణం, క్రైమ్‌మిర్ర‌ర్‌: విశాఖపట్నంలో డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్‌కు సంబంధించి కన్సల్టెన్సీ సంస్థ రైట్స్ కేంద్రానికి కీలక ప్రతిపాదన చేసింది. విశాఖపట్నంలో డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్‌ 20 కిలోమీటర్లు కాకుండా 13 కిలోమీటర్లు సరిపోతుందని కేంద్రానికి తెలిపింది. వాస్తవానికి ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ 20 కిలోమీటర్లకు ప్రతిపాదనలు పంపింది.. కానీ 13 కిలోమీటర్లు సరిపోతుందని రైట్స్ చెబుతోంది.విశాఖపట్నం డబుల్‌ డెక్కర్‌ మెట్రో కారిడార్‌‌కు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రం దగ్గర ఉన్నాయి. మొత్తం 20 కిలోమీటర్లు మేరు డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్‌ను ప్రతిపాదించగా.. ఈ అంశంపై సర్వే చేసిన రైట్స్ కన్సల్టెన్సీ మాత్రం 13 కిలోమీటర్లు చాలని కేంద్రానికి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.

డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్ గాజువాక నుంచి హనుమంతవాక వరకు సరిపోతుందని కేంద్రానికి రైట్స్ కన్సల్టెన్సీ సూచించినట్లు సమాచారం. విశాఖపట్నంలో ఏకంగా 140.13 కిలోమీటర్లు మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ముందుగా మొదటి దశలో 46.23 కిలోమీటర్ల పొడవున రూ.11,498 కోట్లతో ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు చేశారు.ఇంతలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నగరం మధ్యలోని నేషనల్ హైవే దగ్గర ట్రాఫిక్ నియంత్రణ కోసం ఫ్లై ఓవర్ నిర్మిస్తామని తెలిపింది. లంకెలపాలెం నుంచి మధురవాడ వరకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో మెట్రో రైలు ప్రాజెక్టులో డబుల్ డెక్కర్ కారిడార్ ప్రతిపాదన వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ 20 కిలోమీటర్ల మేర డబుల్‌ డెక్కర్‌ కారిడార్ ఏర్పాటుకు ప్రతిపాదించారు.

ఈ మెట్రో డబుల్ డెక్కర్ కారిడార్‌ను స్టీల్‌ప్లాంట్‌ నుంచి గాజువాక వరకు 5 కిలోమీటర్లు.. తాటిచెట్లపాలెం నుంచి మధురవాడ వరకు 15 కిలోమీటర్లు ప్లాన్ చేశారు. నేషనల్ హైవే మధ్యలో మెట్రో కారిడార్ స్టీల్‌ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు నిర్మించాలని భావించారు.ఈ ప్రతిపాదనతో భూసేకరణ అవసరం ఉండదని ఇలా డిజైన్ చేశారు. అలాగే మెట్రో ప్రాజెక్టు వ్యయం కూడా తగ్గుతుందన్నది భావించారు. మెట్రో కారిడార్‌ ఎన్‌హెచ్‌ఏఐ నిర్మిస్తామన్న ఫ్లైఓవర్‌పై వచ్చేలా డిజైన్‌ చేశారు. ఈ మేరకు రాష్ట్ర మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ కేంద్రానికి ఈ ప్రతిపాదనలకు సంబంధించిన డీపీఆర్‌ను పంపింది. నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు పెరిగాయి.

ఈ క్రమంలో నగర ప్రజలు మెట్రో రైల్‌ వస్తే బావుంటుందని ఎదురు చూస్తునన్నారు. ఇంతలో డబుల్‌ డెక్కర్‌ ప్రతిపాదనల్ని కుదించాలని రైట్స్‌ సంస్థ కేంద్రానికి సిఫార్సు చేయడం చర్చనీయాంశమైంది. 20 కిలో మీటర్లకు ప్రతిపాదిస్తే 13 కిలోమీటర్లకు కుదించడం దారుణమన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు