Homeక్రైమ్జాతీయ ర‌హ‌దారిపై ఘోర‌ రోడ్డు ప్ర‌మాదం...తెల్ల‌వారు జామున ఘ‌ట‌న‌...! డ్రైవ‌ర్‌కు తీవ్ర గాయాలు....

జాతీయ ర‌హ‌దారిపై ఘోర‌ రోడ్డు ప్ర‌మాదం…తెల్ల‌వారు జామున ఘ‌ట‌న‌…! డ్రైవ‌ర్‌కు తీవ్ర గాయాలు….

హైదరాబాద్, క్రైమ్‌మిర్ర‌ర్‌: పెద్ద అంబర్‌పేట్-హయత్ నగర్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ.. ముందు వెళ్తున్న మరో లారీని బలంగా ఢీకొట్టడంతో, టిప్పర్ క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ క్యాబిన్ లోపల తీవ్ర గాయాలతో ఇరుక్కుపోయి మృత్యువుతో పోరాడాడు.హయత్ నగర్ వైపు నుండి ఆటో నగర్ వైపు వెళ్తున్న ఒక లారీ టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఆ లారీ రోడ్డు మధ్యలోని డివైడర్‌ను బలంగా ఢీకొట్టి ఆగిపోయింది.

అయితే, అదే సమయంలో అదే మార్గంలో వెనుక నుండి అతివేగంగా దూసుకొచ్చిన ఒక టిప్పర్ లారీ.. డివైడర్‌ను ఢీకొట్టి ఆగి ఉన్న లారీని వెనుక భాగం నుండి అత్యంత బలంగా ఢీకొట్టింది.ఈ ఘోర ఢీకొట్టుడు ప్రభావానికి టిప్పర్ ముందు భాగం పూర్తిగా నలిగిపోయింది. దీంతో డ్రైవర్ సీట్ లోనే కూరుకుపోయి, క్యాబిన్ ఇనుప రేకుల మధ్య తీవ్ర గాయాలతో ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే హయత్ నగర్ పోలీసులు, 108 అత్యవసర సేవల సిబ్బంది యుద్ధప్రాతిపదికన ఘటనా స్థలానికి చేరుకున్నారు.క్యాబిన్ పూర్తిగా నలిగిపోవడంతో డ్రైవర్‌ను బయటకు తీయడం పోలీసులకు సవాల్‌గా మారింది.

గ్యాస్ కట్టర్లు, ఇతర పరికరాల సహాయంతో పోలీసులు, 108 సిబ్బంది సుమారు గంట సేపటి వరకు శ్రమించి క్యాబిన్ భాగాలను తొలగించారు. అత్యంత చాకచక్యంగా డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీసి, ప్రాథమిక చికిత్స అనంతరం చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంత సమయం పాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పోలీసులు క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు