సంగారెడ్డి, క్రైమ్‌మిర్రర్: వివాహేతర సంబంధానికి అడ్డుగా వున్నాడని భర్తను భార్యే హతమార్చింది. పైగా ప్రియుడితో కలిసి మృతదేహాన్ని జేసీబీ సహాయంతో పూడ్చివేసింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం గంగాపూర్ గ్రామంలో నివసిస్తూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కల్పన నర్సుగా పని చేస్తోంది. కొన్ని నెలలుగా ఎల్గోయి గైని పండరి అలియాస్ చింటూ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని, అడ్డుగా ఉన్నాడని ఈ నెల 16వ తేదీన భర్త ముత్యంరెడ్డిని హతమార్చింది.
చనిపోయిన తన సోదరుడికి సమాధి కట్టిస్తామని చెప్పి జేసీబీ సహాయంతో గ్రామ శివారులోని తన పొలంలో గుంత తవ్వించి, భర్త మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. తరువాత ఈ నెల 18వ తేదీన భర్త కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది నిందితురాలు. విచారణ క్రమంలో అనుమానం వచ్చి నిలదీయగా, తన ప్రియుడితో కలిసి తానే ముత్యం రెడ్డిని హతమార్చినట్లు అంగీకరించింది. దీంతో 9 రోజుల తరువాత పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి, నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు