హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్నట్లు ప్రచారం జరుగుతున్న గాడ్ ఆఫ్ వార్ మూవీపై టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ.. ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోవడంతో అభిమానుల్లో సందిగ్ధత పెరుగుతోంది.
గుంటూరు కారం తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కోసం కార్తికేయ స్వామి నేపథ్యంలో ఓ భారీ కథ సిద్ధం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియో కూడా విడుదలైంది. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమాతో బిజీ అవ్వడంతో, అదే కథను ఎన్టీఆర్ దగ్గరకు తీసుకెళ్లినట్లు టాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.
నిర్మాత నాగవంశీ కూడా గతంలో తారక్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌పై పరోక్షంగా హింట్ ఇవ్వడంతో ఈ కాంబో దాదాపు ఫిక్స్ అయిందని అభిమానులు భావించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాపై అఫీషియల్ అప్‌డేట్ వస్తుందని అందరూ ఎదురుచూశారు. కానీ మే 20న ఎలాంటి ప్రకటన రాకపోవడంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆదర్శ కుటుంబం ఫలితం ఎలా ఉంటుందో చూసిన తర్వాతే ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ పై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. అందుకే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌కు పూర్తి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ పూర్తిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాపైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. దీంతో “గాడ్ ఆఫ్ వార్” ప్రాజెక్ట్‌పై తారక్ ఇంకా క్లారిటీకి రాలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే అరవింద సమేత తో బ్లాక్‌బస్టర్ అందుకున్న ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందనే ఆశతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ ప్రాజెక్ట్‌పై సస్పెన్స్ కొనసాగేదే అనిపిస్తోంది.