Homeఆంధ్ర ప్రదేశ్కడప పై లోకేష్ గురి...!

కడప పై లోకేష్ గురి…!

  • స్థానిక సంస్థలను టార్గెట్ చేసుకుని వ్యూహం

  • బలమైన నేతలను గుర్తించాలని నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ఆదేశాలు

 

 

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా ఆయన కడప జిల్లా పై ఫోకస్ పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఇప్పటి నుంచే గట్టి వ్యూహాలు పన్నుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కచ్చితంగా ఏకపక్షంగా స్థానిక సంస్థలను గెలుచుకోవాలని భావిస్తున్నారు. అయితే అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మార్కు బలవంతంగా ఏకగ్రీవాల ద్వారా కాదు. ఒక వ్యూహం ప్రకారం కడప జిల్లాలో సత్తా చాటాలని చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవడం ద్వారా వైయస్ ఫ్యామిలీ హవాను తగ్గించాలని భావిస్తున్నారు.

టిడిపి కూటమి హవా…

2024 అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లాలో ఘన విజయం సాధించింది కూటమి. దశాబ్దాలుగా వైయస్ కుటుంబ హవాను సైతం తట్టుకొని టిడిపి కూటమి ఏడు అసెంబ్లీ స్థానాలను సొంతం చేసుకుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు సీట్లకు మాత్రమే పరిమితం అయింది. అయితే అదేదో కూటమి ప్రభంజనం మాదిరిగా కాకుండా చూడాలని లోకేష్ ఆలోచన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించడం ద్వారా గ్రామస్థాయిలో కూడా బలోపేతం కావాలని చూస్తున్నారు. స్థానిక సంస్థల్లో గెలుపు గుర్రాలను గుర్తించి బరిలో దించేలా ఇన్చార్జి మంత్రులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రతి గ్రామపంచాయతీలో టిడిపి కూటమి జండా ఎగురవేసేలా ఇప్పటినుంచి అభివృద్ధి మంత్రంతో ముందుకు సాగుతున్నారు లోకేష్.

పక్కా స్కెచ్ …

పులివెందుల జడ్పిటిసి ఎన్నికల్లో టిడిపి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం ఒత్తిడితోనే ఆ విజయం సాధ్యమైందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొట్టి పారేసింది. కానీ తెర వెనుక లోకేష్ వ్యూహం మాత్రం పసిగట్ట లేకపోయింది. గతసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలవంతంగానే ఏకగ్రీవాలను చేసుకుంది. ఆ సమయంలో ఆ పార్టీ అనుసరించిన వైఖరి అందరికీ తెలిసిన విషయమే. అయితే కడపలో ఇప్పటికీ తమ పార్టీ బలంగా ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కానీ చాప కింద నీరుల లోకేష్ తన ప్రయత్నాలను మొదలుపెట్టారు.

ప్రతి ఎమ్మెల్యేకు బలమైన దిశా నిర్దేశం చేశారు. తమ పరిధిలోని ప్రతి పంచాయితీ టిడిపి ఖాతాలో పడేలా కీలక సూచనలు చేశారు. టిడిపి తో పాటు కూటమి బలంగా ఉన్నచోట మిగతా రెండు పార్టీలు సైతం యాక్టివ్ కావాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో వైయస్ కుటుంబ హవా ఇంతటితో నియంత్రించాలని.. అలా జరగాలంటే గ్రామస్థాయిలో జెండా పాతాలన్నది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు