హైదరాబాద్,క్రైమ్ మిర్రర్:వేసవిలో విరివిగా దొరికే నేరేడు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా షుగర్ నియంత్రణకు ఉపయోగపడతాయని చాలామంది భావిస్తారు. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని జాగ్రత్తగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
కడుపు సమస్యలు…
కడుపు సెన్సిటివ్‌గా ఉండే వారు నేరేడు పండ్లు ఎక్కువగా తినకూడదు. అధికంగా తీసుకుంటే గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. ఖాళీ కడుపుతో తింటే అసిడిటీ లేదా వికారం కూడా కలగొచ్చు.
షుగర్ లెవెల్స్…
రక్తంలో చక్కెర స్థాయులు తక్కువగా ఉండేవారు నేరేడు పండ్లు మితంగా మాత్రమే తీసుకోవాలి. ఇవి బ్లడ్ షుగర్‌ను మరింత తగ్గించే అవకాశం ఉంటుంది.
సర్జరీ చేసినవారు..
ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నవారు లేదా త్వరలో సర్జరీ చేయించుకునే వారు నేరేడు పండ్లను పరిమితంగా తీసుకోవడం మంచిది. వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.
గర్భిణీలు…
గర్భిణీలు నేరేడు పండ్లు అధికంగా తినకుండా ఉండాలి. మితంగా తీసుకుంటేనే మంచిదని వైద్యులు చెబుతున్నారు.
అలర్జీ సమస్యలు…
కొంతమందికి నేరేడు పండ్లు తింటే దురద, చర్మంపై మచ్చలు, వాపు వంటి అలర్జీ సమస్యలు రావచ్చు. అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వాటిని తినడం ఆపాలి.
మందులు వాడేవారు…
డయాబెటిస్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు మందులు వాడుతున్నవారు నేరేడు పండ్లు ఎక్కువగా తినే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.
మితంగా తీసుకోవాలి…
ఆరోగ్యానికి మంచిదని ఏ ఆహారాన్నైనా అధికంగా తీసుకోవడం మంచిది కాదు. నేరేడు పండ్లను కూడా మితంగా తీసుకుంటేనే పూర్తి ప్రయోజనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.