హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: దేశ రాజకీయాల్లో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ). మొదట సరదాగా మొదలైన ఈ డిజిటల్ ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా యువతలో ఈ పార్టీకి భారీ స్పందన రావడంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ పార్టీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు కోట్లలోకి చేరడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ ట్రెండ్‌పై స్పందించారు. ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. తనదైన వ్యంగ్య శైలిలో ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
ప్రకాశ్ రాజ్ షేర్ చేసిన వీడియోలో కాక్రోచ్ జనతా పార్టీ పై వస్తున్న యువత స్పందనను ప్రస్తావిస్తూ, దేశంలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, వ్యవస్థపై పెరుగుతున్న అసంతృప్తిని పరోక్షంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో పెరుగుతున్న ఈ డిజిటల్ ఉద్యమం రాజకీయ పార్టీలకూ హెచ్చరికలా మారుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు బీజేపీని దాటేశారనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఈ పార్టీకి యువత నుంచి భారీ మద్దతు లభిస్తోందని పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.
ఇక ప్రకాష్ రాజ్ విషయానికి వస్తే.. ఆయన గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఓపెన్‌గా స్పందిస్తూ వస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రాజకీయాలపై తన అభిప్రాయాలను నేరుగా వెల్లడించడం ఆయనకు కొత్తేమీ కాదు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అంశంపై చేసిన ఈ పోస్టుతో మరోసారి వార్తల్లో నిలిచారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. కొందరు ప్రకాష్ రాజ్‌కు మద్దతు తెలుపుతుంటే, మరికొందరు విమర్శలు చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగానూ హాట్ టాపిక్‌గా మారింది